KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ముగిశాయి కానీ.. అసలు ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఫలితాల కోసం ఇంకా రెండు రోజుల సమయం ఉంది. డిసెంబర్ 3న ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ.. ఈ లోపు ఆ పార్టీ గెలుస్తుంది.. ఈ పార్టీ గెలుస్తుంది.. ఆ పార్టీ ఓడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రచారంతో హోరెత్తించి.. ఇప్పుడు ఎన్నికలు ముగిశాక.. ఎవరు గెలుస్తారో వాళ్లకు వాళ్లే ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి కేసీఆర్ రెండు చోట్ల కూడా గెలిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. పలు సర్వేలు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ లో అంతర్మధనం స్టార్ట్ అయింది.
కామారెడ్డి కేసీఆర్ కు కొత్త నియోజకవర్గం. ఇప్పటి వరకు అక్కడ ఎప్పుడూ పోటీ చేయలేదు. కానీ.. కామారెడ్డిలో స్థానికుడైన వెంకటరమణ అనే అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. కానీ.. రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతున్నట్టు తెలుస్తోంది. తొలి స్థానంలో వెంకటరమణ, రెండో స్థానంలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. అది కూడా తన రాజకీయ జీవితం ప్రారంభంలో ఒక్కసారి ఓడిపోయారు. అప్పటి నుంచి కేసీఆర్ ఓడిపోలేదు. ఈసారి ఓడిపోతే అది ఒకరకంగా రికార్డే అవుతుంది.
కామారెడ్డి అంటే అది కేసీఆర్ కు కొత్త నియోజకవర్గం అనుకోవచ్చు. కానీ.. గజ్వేల్ మాత్రం కొత్త నియోజకవర్గం కాదు కదా.. కానీ.. గజ్వేల్ లోనూ కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందట. గజ్వేల్ లో బీజేపీ నుంచి కేసీఆర్ కు గట్టి పోటీ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ ముంపు బాధితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకత వచ్చింది. ముంపు బాధితులకు సరైన పరిహారం ఇవ్వకపోవడంతో పాటు ముంపు బాధితులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బీఆర్ఎస్ ఓటమి గురించి కాదు.. కేసీఆర్ ఓటమి గురించి. కేసీఆర్ ఓటమి అనేది నిజానికి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ అభిమానులకు మింగుడుపడని విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. కేసీఆర్ ఓడిపోవడం అనేది ఆయనకు, బీఆర్ఎస్ కు చాలా మైనస్ కానుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా.. కేసీఆర్ ఓడిపోతే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు.
కేసీఆర్ ఓటమికి ఈ ఒక్క కారణమే కాదు.. చాలా కారణాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం కావచ్చు.. సామాన్యులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, కనీసం సామాన్యులతో మాట్లాడకపోవడం, అహంకారం, కేటీఆర్ అహంకారం, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించలేకపోవడం అనేవి ప్రధాన సమస్యలు.
ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబానికే బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావడం కావచ్చు.. ప్రతిపక్ష పార్టీలపై చేసే విమర్శలు, బీఆర్ఎస్ పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేస్తే వారిని టార్గెట్ చేయడం, వాళ్లపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, ఇలా చాలా విషయాల్లో కేసీఆర్ తన పప్పులో తానే కాలు వేసుకున్నారని అర్థం అవుతోంది. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరించినా.. అది తొందరగా పసిగట్టలేకపోవడం ఒక మైనస్ అయితే.. కాంగ్రెస్ బలోపేతం అవడం మరో మైనస్ అయింది. చివరకు.. అది బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేకూర్చింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.