Revanth And KCR : ఎంపీ ఎన్నికలు రేవంత్, కేసీఆర్ భవితవ్యాన్ని తేలుస్తాయా..?
ప్రధానాంశాలు:
Revanth And KCR : ఎంపీ ఎన్నికలు రేవంత్, కేసీఆర్ భవితవ్యాన్ని తేలుస్తాయా..?
Revanth And KCR : అన్ని ఎన్నికలు ఏమో గానీ.. ఈ సారి తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎన్నికలు మాత్రం ఇద్దరికి ప్రాణ సంకటంగా మారిపోయాయి. అటు కేసీఆర్ కు, ఇటు రేవంత్ రెడ్డికి ఇద్దరికీ ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ ను విసరబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. అయితే ఇప్పటి వరకు తనకు తెలంగాణలో తిరుగులేదని పదే పదే చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే అది మాటల్లో కాదు ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చింది.
Revanth And KCR : తక్కువ సీట్లు వస్తే…
ఈ ఎన్నికల్లో కనీసం పదికి పైగా ఎంపీ స్థానాలు సాధిస్తేనే రేవంత్ కు అటు అధిష్టానం దగ్గర మంచి పేరు ఉంటుంది. అంతే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఆయన గ్రాఫ్ పడిపోకుండా ఉంటుంది. అంతే కాకుండా పార్టీలో కూడా ఆయనకు బలం పెరుగుతుంది. అలా కాదని ఏడు సీట్ల కంటే తక్కువ వస్తే మాత్రం ఆయనకు కష్టాలు తప్పవు. ఎందుకంటే ఇప్పటికే ఆయనపై చాలా మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎదురుతిరుగుతారో చెప్పలేం. అందరినీ బుజ్జిగిస్తూ పోతున్న ఆయనకు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే మాత్రం ఆయన మీద కత్తి ఎత్తే వారు ఎక్కువ అయిపోతారు.
కాకపోతే అధిష్టానం దగ్గర ఆయనకు మంచి పేరు ఉండటం కలిసి వచ్చే అంశం. ఇక కేసీఆర్ కు అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కేసీఆర్ కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఎక్కువ సీట్లు సాధించకపోతే మాత్రం ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది మరోసారి నిరూపితం అవుతుంది. అలా కాదని కనీసం ఓ ఏడు సీట్లు అయితే గెలిస్తే ఆయన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలని అంటున్నారు. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు. బీఆర్ ఎస్ కు ఎన్ని సీట్లు వచ్చినా ఇప్పుడు ప్రజల్లో పెద్దగా గ్రాఫ్ పెరిగే అంశం అయితే లేదంటున్నారు.