Patel Ramesh Reddy : ఈసారైనా పటేల్ రమేష్ రెడ్డి కు దశ మారుతుందా .. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా..?
ప్రధానాంశాలు:
Patel Ramesh Reddy : ఈసారైనా పటేల్ రమేష్ రెడ్డి కు దశ మారుతుందా ..
పటేల్ రమేష్ రెడ్డి కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా..?
Patel Ramesh Reddy : అదృష్టం చాలా మ్యాజిక్ ను చేస్తుంది. వరుసగా దురదృష్టాలు వచ్చి వెక్కిరించిపోవచ్చు.కాస్త ఆలస్యంగా అయిన అదృష్టం తలుపు తట్టొచ్చు. కానీ ఆ అదృష్టం అందరిని వరించదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ నాయకుడికి ఇలాంటి రాజయోగమే పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు పొందినవారు ఎంత సంతోషంగా ఉన్నారో వారితో పాటు ఇంకొంతమంది నేతలు కూడా ఆనందపడుతున్నారు. అలాంటి వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటి చేసి చట్ట సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. 2016 లో రేవంత్ రెడ్డితో పాటు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరారు రమేష్ రెడ్డి. 2018 లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు.
కానీ చివరికి సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఎంపీగా అవకాశం ఇస్తాం అన్నారు. చివరికి ఉత్తమ్ కుమార్ బరిలో దిగడంతో మరోసారి భంగబాటు ఎదురైంది. రెండుసార్లు టికెట్ ఆశించిన రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు రమేష్ రెడ్డి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రమేష్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. ఈసారి కూడా రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ రెడ్డి ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని నిశ్చయించుకొని ఆల్ ఇండియా ఫార్ వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ కూడా వేసారు. కానీ ఉపసంహరణకు చివరి రోజు కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపులు చేసింది. నల్గొండ ఎంపీగా అవకాశం ఇస్తామని అదిష్టానం తో పాటు సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు.
ఎంపీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతానికి అయితే అనేక త్యాగాలు చేసిన ఎంపీగా అవకాశం తనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారట. ఎలాగు సీఎం తన స్నేహితుడు కావడంతో ధీమాగా ఉన్నారట. తనకు మొదటి నుంచి అండగా ఉన్న రమేష్ రెడ్డికి ఎలాగైనా సీటు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదో ఒక ఎమ్మేల్సీ స్థానం ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో రమేష్ రెడ్డి పట్టరాని ఆనందంలో ఉన్నారట. ఇన్నాళ్లు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఫలితం త్వరలోనే రాబోతుందని రమేష్ రెడ్డి ఆశిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి రమేష్ రెడ్డి ఇద్దరు స్నేహితులు. ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి కి అదృష్టం వరించింది. పటేల్ రమేష్ రెడ్డికి దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఈసారైనా రమేష్ రెడ్డి కి అదృష్టం వరిస్తుందేమో చూడాలి.