ఏపీ రాజధాని హైదరాబాద్.. కేసీఆర్ సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
kcr : కరోనా దెబ్బకు తెలుగు రెండు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరగటం తప్ప తగ్గటం లేదు. ఇలాంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రము మొదటిగా రాత్రి కర్ఫ్యూ విధించింది. ఆ తర్వాత బోర్డర్స్ క్లోజ్ చేసింది. చివరిగా 10 రోజులు లాక్ డౌన్ విధించింది. మరోపక్క ఆంధ్రాలో పాక్షిక లాక్ డౌన్ నడుస్తుంది. ఇలాంటి స్థితిలో రెండు రాష్ట్రాల బోర్డర్ వద్ద ఒక రకమైన వాతావరణం నెలకొని ఉంది.
ముఖ్యంగా అంబులెన్సులను తెలంగాణ లోకి అనుమతించే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించటం పట్ల రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మానవత్వం లేనట్లు ఎందుకు ప్రవర్తిస్తారు. అంబులెన్సు లను ఏ అధికారంతో అవుతున్నారు అంటూ ప్రశ్నించింది. దీనితో బోర్డర్ లో అంబులెన్స్ లకు అనుమతి లభించింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు అందుకు ఒప్పోకోలేదు.. మాకెలాంటి సమాచారం రాలేదంటూ యధావిధిగా రెండో రోజు కూడా అంబులెన్స్ లను ఆపేశారు ..
దీనితో జక్కయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఉదయభాను తెలంగాణ పోలిసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేశాడు . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మరో మూడేళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది.. మొదటి రోజు అంబులెన్స్ లను ఆపేయటంతో వెంటనే తెలంగాణ లోని ఉన్నత అధికారులతో మాట్లాడటం జరిగింది. రెండో రోజు కూడా ఏపీ అంబులెన్స్ లను ఆపేశారు .. పోలీసులను అడిగితే మాకు ఎలాంటి సమాచారం లేదని చెపుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరాడు.
ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలతో అభాసుపాలైన తెలంగాణ సర్కార్ kcr బోర్డర్ లో ఏపీ అంబులెన్స్ లను ఆపి మరింత నవ్వులపాలు అవుతుంది. దేశంలో మెరుగైన వైద్యం కోసం ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రంలోకి వెళ్ళవచ్చు, అలాంటి వాటికీ ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన కానీ క్షేత్ర స్థాయిలో ఆ తీర్పు అమలుకావడం లేదు. ఇది ఒక రకంగా కోర్టు ధిక్కరణ చర్య కిందకే వస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ ఇలాంటి తప్పులను సరిచేసుకుంటే మంచిది.