Rains : ఏపీ, తెలంగాణతో పాటు మరో 13 రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ ప్రకటన.. అందరిలో టెన్షన్..!
Rains : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ప్రజలు అల్లకల్లోలం అయ్యారు. చాలా మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వరదలలో మునిగే ఉన్నాయి. అయితే ఈ విషాదం నుండి తేరుకోకముందే ఐఎండీ మరో స్టన్నింగ్ న్యూస్ చెప్పింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది.
దేశ రాజధానిలో పగటి పూట ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబైలో సెప్టెంబర్ 11 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30, 26 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. “పశ్చిమ భారతదేశం, మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్లో చాలా విస్తృతమైన తేలికపాటి / మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12 వరకు మధ్య భారతంలో తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని ఐఎండీ పేర్కొంది.
Rains : ఏపీ, తెలంగాణతో పాటు మరో 13 రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ ప్రకటన.. అందరిలో టెన్షన్..!
సెప్టెంబర్ 5 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం.. “08 -11 మధ్య కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది; 06 -08 వ తేదీలలో కోస్తాంధ్ర- యానాం. తెలంగాణలో సెప్టెంబర్ 8 వరకు, కర్ణాటకలో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని వివరించింది. రాజస్థాన్లో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్లో, సెప్టెంబర్ 9 వరకు రాజస్థాన్లో, సెప్టెంబర్ 7 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పలు ప్రాంతాల్లోని అధికారులు స్పష్టం చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.