Rains : ఏపీ, తెలంగాణ‌తో పాటు మ‌రో 13 రాష్ట్రాల‌కి ఎల్లో అలర్ట్ ప్ర‌క‌ట‌న‌.. అంద‌రిలో టెన్ష‌న్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rains : ఏపీ, తెలంగాణ‌తో పాటు మ‌రో 13 రాష్ట్రాల‌కి ఎల్లో అలర్ట్ ప్ర‌క‌ట‌న‌.. అంద‌రిలో టెన్ష‌న్..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 September 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Rains : ఏపీ, తెలంగాణ‌తో పాటు మ‌రో 13 రాష్ట్రాల‌కి ఎల్లో అలర్ట్ ప్ర‌క‌ట‌న‌.. అంద‌రిలో టెన్ష‌న్..!

Rains : గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కి ప్ర‌జ‌లు అల్ల‌క‌ల్లోలం అయ్యారు. చాలా మంది జీవితాలు రోడ్డున ప‌డ్డాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వ‌ర‌ద‌ల‌లో మునిగే ఉన్నాయి. అయితే ఈ విషాదం నుండి తేరుకోక‌ముందే ఐఎండీ మ‌రో స్ట‌న్నింగ్ న్యూస్ చెప్పింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది.

Rains : ఎల్లో అల‌ర్ట్..

దేశ రాజధానిలో పగటి పూట ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని దిల్లీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబైలో సెప్టెంబర్ 11 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30, 26 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. “పశ్చిమ భారతదేశం, మధ్య భారతంలోని ఛత్తీస్​గఢ్​లో​ చాలా విస్తృతమైన తేలికపాటి / మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12 వరకు మధ్య భారతంలో తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని ఐఎండీ పేర్కొంది.

Rains ఏపీ తెలంగాణ‌తో పాటు మ‌రో 13 రాష్ట్రాల‌కి ఎల్లో అలర్ట్ ప్ర‌క‌ట‌న‌ అంద‌రిలో టెన్ష‌న్

Rains : ఏపీ, తెలంగాణ‌తో పాటు మ‌రో 13 రాష్ట్రాల‌కి ఎల్లో అలర్ట్ ప్ర‌క‌ట‌న‌.. అంద‌రిలో టెన్ష‌న్..!

సెప్టెంబర్ 5 నాటి వాతావరణ బులెటిన్ ప్రకారం.. “08 -11 మధ్య కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది; 06 -08 వ తేదీలలో కోస్తాంధ్ర- యానాం. తెలంగాణలో సెప్టెంబర్ 8 వరకు, కర్ణాటకలో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది,” అని వివరించింది. రాజస్థాన్​లో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్​లో, సెప్టెంబర్ 9 వరకు రాజస్థాన్​లో, సెప్టెంబర్ 7 వరకు ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పలు ప్రాంతాల్లోని అధికారులు స్పష్టం చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది