Yellow Book : మొన్న రెడ్ బుక్.. ఇప్పుడు ఎల్లో బుక్.. ఇంకెన్ని బుక్‌లు వ‌స్తాయో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yellow Book : మొన్న రెడ్ బుక్.. ఇప్పుడు ఎల్లో బుక్.. ఇంకెన్ని బుక్‌లు వ‌స్తాయో..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,6:10 pm

ప్రధానాంశాలు:

  •  Yellow Book : మొన్న రెడ్ బుక్.. ఇప్పుడు ఎల్లో బుక్.. ఇంకెన్ని బుక్‌లు వ‌స్తాయో..!

Yellow Book : ప్ర‌స్తుతం ఏపీలో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ నాయ‌కులు మొద‌ట్లో కాస్త సైలెంట్ అయిన‌ట్టు క‌నిపించిన ఇప్పుడు వారు కూట‌మి ప్ర‌భుత్వానికి స‌వాళ్లు విసురుతున్నారు. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు, అధికారుల కోసం రంగు రంగుల బుక్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నారా లోకేశ్… గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్రత్యర్థుల కోసం ‘రెడ్ బుక్’ పెట్టుకున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అధికారులను, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా ఓ బుక్ పెడతామని ప్రకటించారు.

Yellow Book ఇంకెన్ని బుక్స్ ..

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదని, మనం గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మ‌ధ్య‌లో రెడ్‌బుక్‌ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అన్యాయంగా వ్యవహరించే వారి పేర్లను, అధికారుల పేర్లను రాసుకుంటున్నారన్నారు. అయితే తాము గుడ్‌బుక్‌ రాసుకోవడం మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను అందులో రాసుకుంటున్నామన్నారు. ఈ మ‌ధ్య‌లో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతో మరో బుక్ తెచ్చారు. అది సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పారు.

Yellow Book మొన్న రెడ్ బుక్ ఇప్పుడు ఎల్లో బుక్ ఇంకెన్ని బుక్‌లు వ‌స్తాయో

Yellow Book : మొన్న రెడ్ బుక్.. ఇప్పుడు ఎల్లో బుక్.. ఇంకెన్ని బుక్‌లు వ‌స్తాయో..!

ఇలా ఎవరి బుక్ వారికి ఉంటే ఎల్లో మీడియా మరో బుక్ తీస్తోంది. అదే ఎల్లో బుక్. టీడీపీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా ఎల్లో బుక్ లో కూట‌మి పార్టీల‌కి చెందిన నాయ‌కుల పేర్ల‌ని చేర్చుతుందట‌. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతీ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారని తమకు వచ్చిన అపరిమితమైన అధికారాన్ని వాడుకుంటూ వారు దందాలు చేస్తున్నారని, కమిషన్లు దందాలతో హడలెత్తిస్తున్నారు అని , అలా నియోజకవర్గాల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లుతోందని కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఎల్లో మీడియా ఈ తరహా దందా రాయుళ్లను అందరికీ కలిపి ఒక్ లిస్ట్ తయారు చేసి మరీ ఎల్లో బుక్కులో రాస్తోందిట. దీనిని అధినాయకత్వానికి పంపించి వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకునేలా ప్లాన్ చేస్తుంద‌ట‌.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది