Maha Kumbh : కుంభమేళా మృతులకి ఎవరు బాధ్యత వహిస్తారు... తప్పెవరిది..!
Maha Kumbh : ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి జనాలు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తుండడంతో ఆ ప్రాంతం అంతా సంద్రంగా మారింది. అయితే తాజాగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. అమృత స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వచ్చిన భక్తులు తొక్కిసలాట జరగడంతో ఇరవై మంది వరకూ మరణించారని చెబుతున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. మౌని అమావాస్య రోజు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భావించి ఒక్కరోజులోనే పది కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు.
Maha Kumbh : కుంభమేళా మృతులకి ఎవరు బాధ్యత వహిస్తారు… తప్పెవరిది..!
సంగం ఘాట్ లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కొందరు చెప్పడం వల్లనే అందరూ అదే ఘాట్ కు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో బ్యారికేడ్లు తోసుకుని స్నానం చేసేందుకు ముందుకు వెళ్లడంతో నిన్న రాత్రి ఘాట్ వద్ద నిద్రిస్తున్న భక్తులపై పడి పదులసంఖ్యలో మరణించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ తొక్కిసలాటలో యాభై మందికి గాయాలు కావడంతో వారిని వెంటనే సమీపంలోని వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్ లు కూడా అక్కడే ఉండటంతో వెంటనే వైద్య శిబిరాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తులు ఏ ఘాట్ లోనైనా స్నానం చేయవచ్చని ప్రభుత్వం చెబుతుంది. కేవలం సంగం ఘాట్ కు మాత్రమే రావాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు రైళ్లను కూడా రద్దు చేశారు. తొక్కిసలాట జరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే మార్గంలో 47 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పదహారు గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల్లో ఉన్న ప్రయాణికులు నీరు, భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. మౌని అమవాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం సెక్టార్2 ప్రాంతంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో వంద మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. అయితే రానున్న రోజులలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. తొక్కిసలాట గురించి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయబోతే ఎలా? త్రివేణి సంగమం కోసం ఎగబడకుండా ఏ ఘాట్ కి అయిన వెళ్లమని ముఖ్యమంత్రి చెబితే ఎలా ఉంటుంది.మృతుల సంఖ్యని ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించకపోవడం శోచనీయం అంటున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.