Ys Jagan : జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,1:00 pm

Ys Jagan : ఏపీలో రాజ‌కీయాలు ఎంత ఆసక్తిక‌రంగా మారాయో మ‌నం చూశాం. వైనాట్ 175 అన్న జ‌గ‌న్ 11 స్థానాల‌కే ప‌రిమితం అయ్యాడు. దీంతో త‌న ఓట‌మికి లెక్క‌లు వేసుకుంటున్నాడు జ‌గన్. అయితే అధికారంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారు, సాధారణ కార్యకర్తలు, అభిమానుల్ని పూర్తిగా దూరం చేసేసి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు మాత్రమే పరిమితం చేయడంలో కొందరు సలహాదారుల పాత్ర ఉంది అని అర్ధం అవుతుంది. కాగితాలపై రాసిచ్చి వాటిని మాత్రమే చదవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పరిమితం చేయగలిగారు. ఐదేళ్లలో మీడియాతో మాట్లాడకుండా, ప్రశ్నించే అవకాశమే ఎవరికి దక్కనివ్వకుండా చేయడంలో ఇలాంటి సలహాదారులే ప్రధాన పాత్ర పోషించారు.

Ys Jagan నిండా ముంచేశారు..

ఇప్పుడు ఆయ‌న‌ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి, వైసీపీ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించిన సలహాదారులు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సొంత వారికి పెద్ద ఎత్తున సలహాదారుల పోస్టుల్ని వైసీపీ కట్టబెట్టింది. వారిలో చాలామంది నామమాత్రంగా సర్దుకుపోయినా నలుగురైదుగురు మాత్రం బాగా పెత్తనం చెలాయించారు. ఏ మంత్రి ఏమి చేయాలన్న, ఏ శాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సదరు సలహాదారుడికే బాధ్యత అప్పగించేవారు. ఫక్తు ప్రాంతీయ పార్టీగా వైసీపీని నడిపించి బొక్కబొర్లా పడ్డానికి సదరు సలహాదారుడే కారణమనే విమర్శ‌లు ఉన్నాయి.

Ys Jagan జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు

Ys Jagan : జ‌గ‌న్‌ని ఓడించి మెల్ల‌గా అక్క‌డ నుండి జారుకున్న స‌లహాదారులు..!

సర్వేలు, నివేదికల పేరిట కోట్లు కూడబెట్టకోవడం వెనుక కూడా కొందరు సలహాదారుల ప్రమేయం ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఠాలుగా జట్టుకట్టి జగన్‌ను నిండా ముంచేశారనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా వీరు పనిచేశారనే విమర్శ‌లు ఉన్నాయి. అధికార పార్టీ తరపున గత ఏడాదిన్నర కాలంలో సాగిన ప్రచారంలో కూడా సిఎంఓలో పనిచేసిన వ్యక్తులే బినామీ పేర్లతో సొమ్ము కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక జ‌గ‌న్‌ని నిండా ముంచేసిన సలహాదారుల్లో పలువురు ఇళ్లు కూడా ఖాళీ చేసి తాడేపల్లి నుంచి మాయం అయిపోయారు అని టాక వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బీరాలు పలికిన వారు కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది