YS Jagan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు వై.యస్ జగన్ శుభవార్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు వై.యస్ జగన్ శుభవార్త..!

 Authored By tech | The Telugu News | Updated on :15 March 2024,9:15 am

ప్రధానాంశాలు:

  •  YS Jagan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు వై.యస్ జగన్ శుభవార్త..!

YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తీసుకువచ్చింది. ఈసారి ఎలక్షన్స్ లో మళ్లీ విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవాలనే ఆతృతతో జగన్ సర్కార్ అన్ని వర్గాల నుండి ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ జగన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. అయితే ఇప్పటికే ఏపీలోని రైతులకు మూడో విడత రైతు భరోసాను అందించిన వైయస్ జగన్ ఇప్పుడు 2023 24 సంవత్సరంలో మిచాన్ తుఫాన్ తో తీవ్ర వర్షాల కారణంగా , తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా , ఖరీఫ్ మరియు రబీ పంటలను నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వనున్నారు.
అదేవిధంగా ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర విషయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొక్కజొన్నలు హైబ్రిడ్ రకం జొన్నలకు గిట్టుబాటు ధరలను ప్రకటిస్తూ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ కొనుగోల్లను మే 15 వరకు జరపాలని నిర్ణయించింది. అంతేకాక మొక్కజొన్నకు కనీసం మద్దతు ధర క్వింటాకు 2090 రూపాయలను చెల్లించాలని పేర్కొంది. ఇక దీనిపై వ్యవసాయ మార్కెట్ శాఖ స్పెషల్ సిఎస్ మార్గదర్శకాలను కూడా జారీ చేయడంతో మార్క్ ఫెడ్ కూడా రంగంలోకి దిగింది.

ఇది ఇలా ఉండగా మరోవైపు హైబ్రిడ్ రకం జొన్నలకు సంబంధించి మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్ ధర ఉండటంతో దీనికి కూడా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు రైతు భరోసా కల్పించడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద హైబ్రిడ్ రకం జొన్నలను కొనుగోలు చేయాలని జగన్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది