YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 October 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..!

YCP  : ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంపై జగన్ సమీక్ష మొదలైంది. భారీ ఓటమి మూటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా తీసుకు రాలేకపోయింది. 175 కి 175 తెలుస్తా అన్న వారు కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. 90 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని భావించిన వైసీపీ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్నిచోట్ల చేదు ఫలితాలు చూసింది. ఈ ఓటమికి నేతల తీరు కారణమని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణుల నుంచి కూడా ఫిర్యాదులు దాని మీదే వచ్చాయి. జగన్ సైతం వారిని ఏకీభవించక తప్పలేదు. అందుఏ రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థను తొలగించే నిర్ణయానికి వచ్చారు. ఐతే ఈసారికి వాటిని కొనసాగించేలా ఐతే కోఆర్డినేటర్లుగా తనకు కావాల్సిన వారిని నమ్మిన వారికి బాధ్యతలు అప్పగించారు జగన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోఆర్డినేటర్ల హవా ఒక రేంజ్ లో నడిచింది.

YCP  ఎమ్మెల్యేలు.. మంత్రిల కన్నా వారే ప్రాధాన్యం..

ఎమ్మెల్యేలు.. మంత్రిల కన్నా వారే ప్రాధాన్యం అనేట్టుగా పరిస్థితి కనిపించింది. ఉత్తరాధృఅ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు.. ఆ తర్వాత వైవీరెడ్డి వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ముత్యాల నాయుడు క్యాబినెట్ లో ఉన్నారు. ఐతే రీజనల్ కో ఆర్డినేటర్ కు ఉన్న గౌరవం దక్కలేదు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టడానికి వీలు లేదు. కో ఆర్డినేటర్స్ మాత్రం అన్నిట్లో జోక్యం చేసుకునే వారు. అందువల్లే కో ఆర్డినేటర్ల మీద మంత్రులు అసంతృప్తిగా ఉండేవారు అవే పార్టీలో విభేదాలకు కారణమయ్యాయి.

YCP రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే ఓడిన చోటే గెలవాలని

YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..!

అంతేకాదు సీమె జగన్ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహీరించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న టైం లో జిల్లాల్లో సీనియర్ నేతలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ టైం లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జగన్ గుర్తించారు. రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటే పార్టీపై పర్యవేక్షణ ఉంటుంది. ఐతే కొన్నిదిద్దుబాట్లు చేసి వారిని నియమించుకున్నారు జగన్. ఐతే ఈసారి కోఆర్డినేటర్లు తమ విధేయత చాటేలా పనిచేస్తారని జగన్ చూస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది