YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

 Authored By sandeep | The Telugu News | Updated on :4 January 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

YS Jagan : ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ వీలున్న‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుని ఏకిపారేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఆరు నెల‌లు అవుతున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ని విధానం చూస్తుంటే ఇంత బ‌రితెగింపు ఏంట‌ని అనిపిస్తుందని జ‌గ‌న్ అన్నారు. త‌న సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబుని ఓ రేంజ్‌లో ఏకి పారేసారు జ‌గ‌న్. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

YS Jagan చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

జ‌గ‌న్ వార్నింగ్స్..

ఇక అధికారంలోకి రాక‌ముందు తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అంటూ నిప్పులు చెరిగారు జ‌గ‌న్.

అంతేకాదు రైతు భ‌రోసా తీరు కూడా ఏ మాత్రం బాగోలేదు అంటూ జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారంటూ విమ‌ర్శించారు. ఇదిగో అదుగో అంటూ లీకులు ఇస్తున్నా కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు తాము పెట్టామని,, కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని చెప్పారు త‌ప్ప ఇప్పటి వ‌ర‌కు ఒక్క పైసా ఇవ్వ‌లేదు అని జ‌గ‌న్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది