YSRCP : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. తెర వెనుక ఏదో జరుగుతుందా..?
ప్రధానాంశాలు:
నారా లోకేష్ కు క్రిస్ మస్ గిఫ్ట్ పంపిన వైఎస్ షర్మిల
నిన్న పీకే.. ఇవాళ షర్మిల
షాక్ లో వైసీపీ
YSRCP : అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అందుకే రాజకీయాలు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ వైపునకు మళ్లారు. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ప్రశాంత్ కిషోర్ పై ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగేవారు. బీహారోడు ఇక్కడేం చేస్తాడంటూ విమర్శించేవారు. కానీ.. ఇప్పుడు మళ్లీ అదే ప్రశాంత్ కిషోర్ ను టీడీపీ గెలుపు కోసం పని చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఈసారి 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్.. టీడీపీ గెలుపు కోసం పని చేయడం అనేది వైసీపీకి ఒక విధంగా షాక్ అనే చెప్పుకోవాలి.
అదంతా పక్కన పెడితే.. తాజాగా వైఎస్ షర్మిల.. నారా లోకేష్ కు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ పంపించారట. ఇది జగన్ కు మరో షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గరవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం పని చేసిన వాళ్లు అంతా ఇప్పుడు టీడీపీ క్యాంప్ లోకి వెళ్తున్నారు. జగన్ ప్రత్యర్థి చంద్రబాబును కలుస్తున్నారు. నిన్న పీకే, ఇవాళ షర్మిల.. టీడీపీ వైపు మళ్లుతున్నారా అనే అనుమానం కలుగుతోంది.
YSRCP : వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వరుస పరిణామాలు
అసలు.. నారా లోకేష్ కు, వైఎస్ షర్మిలకు సంబంధమే లేదు. కానీ.. వైఎస్ షర్మిల.. నారా లోకేష్ కు క్రిస్ మస్ గిఫ్ట్ పంపించడం ఏంటి. అంటే.. ఆమె టీడీపీకి దగ్గరవుతున్నట్టే కదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముంగిట వైసీపీకి ఈ షాకులేంటి అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో?