YS Sharmila : చెల్లి బిడ్డల ఆస్తులు కొట్టేయాలని కుట్రలు.. జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
YS Sharmila : చెల్లి బిడ్డల ఆస్తులు కొట్టేయాలని కుట్రలు.. జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి Ys Jagan వైఎస్ జగన్‌కి నమ్మిన బంటుగా ఉన్న విజయ సాయి రెడ్డి vijayasai reddy ఇటీవల వైసీపీ YCP పార్టీ నుండి పూర్తిగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయసాయిరెడ్డి Vijay Sai Reddy హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో Ys Sharmila షర్మిలతో భేటీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తాజాగా ధ్రువీకరించారు. సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయని షర్మిల చెప్పారు. ‘‘జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయటపెట్టాను. అయితే… అవన్నీ అబద్ధాలని చెప్పాలంటూ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా vijayasai reddy సాయిరెడ్డికి ఫోన్ చేసి… ప్రెస్‌మీట్ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించినా… జగన్ ఒప్పుకోలేదు అని షర్మిళ తెలియజేశారు.
![YS Sharmila చెల్లి బిడ్డల ఆస్తులు కొట్టేయాలని కుట్రలు జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/YS-Sharmila-1.jpg)
YS Sharmila : చెల్లి బిడ్డల ఆస్తులు కొట్టేయాలని కుట్రలు.. జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
YS Sharmila గట్టిగా ఇచ్చి పడేసింది…
తనకు ఇష్టంలేదని, కుదరదని vijayasai reddy సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నీ స్వయంగా జగన్ నోట్ ఇచ్చారట! ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్ చేశారట’’ అని షర్మిల Ys sharmila వివరించారు. జగన్ Ys Jagan నైజం ఏమిటో విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారని… ఈ విషయాలను ఆయన చెబుతుంటే తనకు చాలా బాధేసిందని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు. వైఎస్ పేరుతో అధికారంలోకి వచ్చి ఆయన ఆశయాలు కాలరాశారన్నారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు వేశారు. సొంతచెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మీరా? ఇంకొకరి గురించి మాట్లాడేదని విమర్శించారు. జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని షర్మిల విమర్శించారు.
డబుట్టిన చెల్లెలని కూడా చూడకుండా వైఎస్ జగన్ దిగజారిపోయారు. నా వ్యక్తిత్వంపైనా పలువురితో నీచంగా మాట్లాడించారు. జగన్ ఇటీవల వ్యక్తిత్వం గురించి పెద్ద డైలాగులు చెప్పారు. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మరచిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం ఆడాలని విజయసాయిపై ఒత్తిడి చేశారు. పరువు పోతుందని విజయసాయిరెడ్డి చెప్పినా వైఎస్‌జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయి రాసుకున్నారట. ఇదీ Ys Jagan జగన్ మహోన్నతమైన క్యారెక్టర్. వైఎస్ బీజేపీకి BJP వ్యతిరేకమని… ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల అన్నారు. వైఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టాగా… వాటిని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. క్రెడిబిలిటీ ఉంటే ప్రాజెక్టుల జగన్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు షర్మిళ Ys Sharmila .