YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ… విభేదాలే కారణమా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ… విభేదాలే కారణమా…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ... విభేదాలే కారణమా...?

YS vijayamma : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ వైయస్ విజయమ్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకు ఏపీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండకుండా దూరంగా వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె విదేశాలకు పయనం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

YS vijayamma : ఎన్నికలు ముగిసే వరకు విదేశాల్లో…

ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేంత వరకు తిరిగి దేశంలోకి అడుగుపెట్టేది లేదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికోసం ఆమె అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాటలు. అయితే విజయమ్మ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వైయస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు అని చెప్పాలి. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అంటున్నారు.

YS vijayamma : విభేదాల కారణమా…

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వైయస్ జగన్ వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైయస్ జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి ఆయన నెగ్గితే చాలు ఇక తిరుగు ఉండదు. కానీ ఓడితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విజయమ్మ కుమారుడు జగన్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే ఆమె కుమార్తె షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కడప గడ్డ నుండి జగన్ కు సవాల్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఏపీలోకి వచ్చిన తర్వాత మాత్రం షర్మిల ను పూర్తిగా పక్కన పెట్టేసారని చెప్పాలి. అంటే సొంత కొడుకు కూతురు ఈ విధంగా ఉండడం ఆమెకు ఇష్టం లేదని చెప్పాలి. అయితే విజయమ్మ కూడా జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. అదేవిధంగా జగన్ కి ఎదురుగా నిలబడుతున్న షర్మిలను కూడా దీవిస్తున్నారు. కానీ పూర్తి మద్దతు ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య షర్మిలమ్మ నలిగిపోతోంది.

YS vijayamma అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ విభేదాలే కారణమా

YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ… విభేదాలే కారణమా…?

YS vijayamma : తమ తరఫున ప్రచారాలు చేయాలని కోరడంతో…

ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు తమ పార్టీ తరుపున ప్రచారాలు చేయాల్సిందిగా కోరుతుంటే ఏదో ఒక పక్షాన ఉండడం విజయమ్మ కి అసలు ఇష్టం లేదు. దీంతో ఎవరి పక్షం ఉండకుండా తల్లిగా తన బిడ్డలు ఇద్దరు క్షేమాన్ని కోరుకుంటున్నారు విజయమ్మ. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉండటం కంటే విదేశాలకు వెళ్లి కొన్నాళ్లపాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని విజయమ్మ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తిరిగి ఆమె ఏపీలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ న్యూస్ విన్న నేటి జనులు ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మొత్తానికి విజయమ్మ ఈసారి ఏపీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు దేశాన్ని విడిచి దూరంగా వెళ్తున్నారన్నమాట.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది