Ysrcp : హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికలలో గెలుపెవరిది అనే దానిపై కొద్ది రోజులుగా చర్చలు నడుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయడం ఖాయమని వైసీపీ చెబుతుండగా, ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది విశ్వసమా..అతి విశ్వాసమా..అసలు ఏంటి వైసీపీ నేతల ధీమా.
ముందస్తుగా ఈ ప్రచారం ఎందుకు? గెలిచిన తర్వాత ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి? ఈ ముందస్తు హడావిడి ఏంటి? నిజంగా విశాఖలో ఆ పరిస్థితి ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీని గురించి చర్చ ఓ రేంజ్‌లో నడుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అది మొదలు.. అసలు విశాఖలో ఖాళీ ఉండదని.. నింగి, నేల అంతా వైసీపీ మయం అయిందని ప్రచారం ప్రారంభించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హోటల్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ప్రయాణానికి అంత ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రచార ఆర్భాటం ప్రారంభించిందో.. రాష్ట్రవ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది.
నిజంగా విశాఖలో హోటళ్లు దొరకడం లేదా? రైలు, బస్సుల టిక్కెట్లు దొరకడం లేదా? రిజర్వేషన్లు దొరకడం లేదా? అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. కానీ ఇలా ఆరా తీయక ముందే.. హోటల్లు, రిసార్టులు తమకు తాము ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురు ప్రకటనలు చేస్తున్నాయి. ఇక బస్సు సర్వీసులు అయితే.. జూన్ 9 నాటికి, అంతకుముందు నాటికి ఎక్కువ టికెట్లు ఖాళీగా చూపుతున్నాయి. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం అతి అని తెలుస్తోంది. అది మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తోంది. ఎన్నికల తరువాత ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో 2019 లో వచ్చిన 151 అసెంబ్లీ..22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి రానున్నారు. అయితే, పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీ శ్రేణుల్లో నిజంగా జగన్ చెప్పినట్లుగా 151 కంటే ఎక్కువ సీట్లు సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.