YS Jagan : మరీ ఇంత మోసం చేస్తే ఎలా బాబు గారు.. మండిపడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రధానాంశాలు:
YS Jagan : మరీ ఇంత మోసం చేస్తే ఎలా బాబు గారు.. మండిపడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
YS Jagan : ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు అధికార దాహంతో సూపర్ సిక్స్ అంటూ సాధ్యం కానీ హామీలను ప్రకటించారు ఆ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదు అనే విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ హామీలని నెరవేర్చడం కాస్త కష్టతరం కావడంతో ఇప్పుడు దానిపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రతిసారి జగన్ కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియా వేదికగా ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
YS Jagan దగా చేశారు..
ముఖ్యంగా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయామంలో అమ్మఒడి పేరుతో ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి 15 వేల రూపాయలను అందజేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ 15000 రూపాయలు ఇస్తామని ప్రచారం చేశారు. రోడ్లపైకి వెళ్లి నీకు 15 వేలు. నీకు15..నీకు 15 అంటూ ప్రచారం చేశారు ఇక అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది విద్యా సంవత్సరం కూడా పూర్తి కావస్తుంది కానీ ఇప్పటివరకు తల్లికి వందనం పేరుతో ఏ తల్లి ఖాతాలో డబ్బు జమ కాలేదు అయితే ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగి వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రజలందరినీ మోసం చేస్తున్నారని తెలిపారు.
ఇక రైతు భరోసా పథకం కింద మీరిస్తామన్న 20వేల రూపాయలు కూడా ఎక్కడ అంటూ ప్రశ్నించారు అన్నదాత సుఖీభవ పేరుతో 20వేల రూపాయల రైతులు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు ఇప్పటికే ఖరీఫ్ రబి సీజన్లు కూడా పూర్తి అవుతున్న ఇప్పటివరకు ఆ డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో జమ కాలేదు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మరి ఇంత బరితెగింపు ఏంటి చంద్రబాబు.. అయినా ఇచ్చిన మాటను తుంగలో తొక్కేయడం మీకు అలవాటే కదా..రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటికీ బయటకు వస్తూనే ఉన్నాయని.. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయని ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం వారి తరుపున మా పార్టీ నిలబడుతుందని జగన్ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పై మండిపడుతూ జగన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.