Pawan kalyan : వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,6:00 pm

Pawan kalyan : ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గ‌డుపుతున్నారు. మ‌రోవైపు మీడియాతో కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ముచ్చ‌టిస్తున్నారు. అయితే ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి విష‌యం గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మీడియా ప్ర‌శ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన పవన్… దాని గురించి చదవడం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని.. నేరస్థులు కూడా మైనర్లే అని అన్నారు. ఇది శారీరక విద్య గురించి కాదు, యువకుల మనస్సులు భ్రష్టుపట్టిపోతున్నాయని తెలిపారు. అలానే యువకులు మనస్సులు అనేక కారణాల వల్ల చెడిపోతున్నాయి… పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించబడుతుందని భావిస్తున్నాను అని స్పందించారు.

దీంతో… వైసీపీ ఈ రీయాక్షన్ పై రియాక్ట్ అయ్యింది. అంత దారుణ‌మైన ఘ‌ట‌న జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరును తప్పుపట్టింది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. నేను పేపర్ లో చదివాను అని చెప్పడం ఏంటి పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో లా & ఆర్డర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు? అని ప్రశ్నించింది! మ‌రి దీనిపై ప‌వ‌న్ కాని, జ‌న‌సేన నాయ‌కులు కాని ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే పిఠాపురం నుంచి తొలిసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ చేతిలో అయిదు కీలకమైన శాఖలు ఉన్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ తాగు నీరు, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఎంతో ముఖ్యమైన శాఖలను పవన్ చూస్తున్నారు.

Pawan kalyan వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు

Pawan kalyan : వైసీపీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు

పర్యావరణం మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆ శాఖ మీద ఆయన చేస్తున్న సమీక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. డబ్బు ఖర్చు కాకుండానే మార్పులను తీసుకుని రావచ్చు అని పవన్ చెబుతున్న మాటలు తెలియచేస్తున్నాయి. ప్లాస్టిక్ సహా వ్యర్ధాలను ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల మీద పారవేయడం వల్ల కాలుష్యం పేరుకుపోతోందని గోవులను పూజించే మనమే వాటి ప్రాణాలకు ఈ విధంగా తీస్తున్నామని పవన్ అంటున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తిని ఆవులు అకాల మృత్యువాత పడుతున్నాయని కూడా పవన్ అంటున్నారు. అలాంటి వ్యర్థాలను కనుక రీసైక్లింగ్ చేసి వినియోగించుకుంటే ఎంతో మేలు జరగడమే కాకుండా సంపద సృష్టి జరుగుతుందని ఆయన చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది