ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కందుకూరు సిటీలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా గురువారం ఏర్పాటు చేయగా, దీనిని కందుకూరు శాసన సభ్యులు మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ ఆటోమేటిక్‌గా వస్తుందని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం ఈ మేళాను ఆర్గనైజ్ చేసినట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. ఇకపోతే జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
దాదాపు 1,500 మందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో టీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్, కందుకూరు తహసీల్దార్ సీతారామయ్య పాల్గొన్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.