Prakasham.. జాబ్ మేళా ప్రారంభం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prakasham.. జాబ్ మేళా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కందుకూరు సిటీలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌ ప్రాంగణంలో జాబ్ మేళా గురువారం ఏర్పాటు చేయగా, దీనిని కందుకూరు శాసన సభ్యులు మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ ఆటోమేటిక్‌గా వస్తుందని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం ఈ మేళాను ఆర్గనైజ్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :23 September 2021,3:06 pm

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కందుకూరు సిటీలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పట్టణంలోని టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌ ప్రాంగణంలో జాబ్ మేళా గురువారం ఏర్పాటు చేయగా, దీనిని కందుకూరు శాసన సభ్యులు మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ ఆటోమేటిక్‌గా వస్తుందని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం ఈ మేళాను ఆర్గనైజ్ చేసినట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. ఇకపోతే జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

దాదాపు 1,500 మందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో టీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్, కందుకూరు తహసీల్దార్ సీతారామయ్య పాల్గొన్నారు.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది