Pushpa Movie Review : పుష్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ .. త‌గ్గేదేలే..!

Advertisement
Advertisement

Pushpa Movie Review Live Updates | పుష్ప  Pushpa Movie Review సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ తరుణం రానే వచ్చింది. మొత్తానికి పుష్ప సినిమా ఈరోజు అంటే శుక్రవారం, 17 డిసెంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే.. యూఎస్ లో ఇప్పటికే సినిమా విడుదలయిపోవడం.. అక్కడ బెనిఫిట్ షోలను కూడా వేయడంతో సినిమా మనకంటే ముందే అక్కడ సినీ అభిమానులు చూసేశారు. సినిమా చూసి.. సోషల్ మీడియాలో దానిపై రివ్యూలు Pushpa Movie Review ఇస్తున్నారు. మరి.. సినిమా ఎలా ఉందో దానికి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ ను ఇప్పుడే తెలుసుకుందాం రండి.

Advertisement

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్న నటించగా.. సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. సునీల్ కూడా విలన్ రోల్ నే పోషించాడు. ప్రకాశ్ రాజ్, ధనుంజయ్, బాబీ సింహా, జగపతిబాబు, అనసూయ… ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేశారు.సినిమా స్టార్ట్ అవ్వడమే శేషాచలం అడవుల గురించి.. ఎర్రచందనం వివరాల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు. ఆ తర్వాత పేర్లు పడ్డాయి.

Advertisement

Pushpa Movie review and Live Updates  యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్

Allu Arjun Pushpa Movie Review and Live Updates

ఇక.. ఫస్ట్ సీనే.. అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుంది. అల్లు అర్జున్ ఎర్ర చందనం దుంగలను తన లారీలో తీసుకొని పారిపోతుండగా.. తమిళనాడు పోలీసులు ఆపుతారు. దీంతో అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఆటిట్యూట్, యాస, మాడ్యులేషన్ అదిరిపోయాయి.

అల్లు అర్జున్(పుష్ప).. ఎర్రచందనం కూలీలకు లీడర్. శేషాచలం అడవుల్లో ఈ గ్యాంగ్ అంతా కలిసి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఓసారి పోలీసులు వచ్చి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు పుష్ప. ఆ తర్వాత సినిమాలో ఫస్ట్ సాంగ్ ఎంట్రీ ఉంటుంది. దాక్కో దాక్కో మేక పాట ప్రారంభం అవుతుంది.

దాక్కో దాక్కో మేక పాటను థియేటర్ లో కూర్చున్న వాళ్లు అయితే ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు. పాట అయిపోగానే.. లారీ చేజింగ్ సీన్ ఉంటుంది. అది అయితే సినిమాకే ప్లస్ పాయింట్. పుష్ప అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు ఉన్న లారీని వెంబడించి మరీ పోలీసులు పట్టుకుంటారు. అతడిని అరెస్ట్ చేస్తారు.

అరెస్ట్ చేసి దుంగలు ఎక్కడ దాచిపెట్టావు అంటూ ప్రశ్నిస్తారు. వాళ్ల స్టయిల్ లో విచారిస్తారు. బాగా కొడతారు. ఇంతలో పుష్పకు బెయిల్ ఇప్పించేందుకు కొండారెడ్డి వస్తాడు.

కొండారెడ్డి(అజయ్ ఘోష్) ఎవరో కాదు. పుష్ఫ తండ్రికి పుట్టిన కొడుకు. అంటే కొండారెడ్డి, పుష్ప… ఇద్దరూ అన్నదమ్ములే కానీ.. తల్లులు వేరు. అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన మనిషి కొండారెడ్డి. అదే సమయంలో.. కొండారెడ్డి, పుష్ఫకు మధ్య ఉన్న బంధం గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వస్తుంది.
మరోవైపు సినిమాలో రష్మిక మందన్న ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. శ్రీవల్లి పాటతో రష్మిక ఎంట్రీ ఉంటుంది. ఆ పాటలో ఉండే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. తను ఒక పాల బండి దగ్గర కూలీగా పనిచేస్తూ ఉంటుంది.

ఇక.. పుష్ప, శ్రీవల్లికి మధ్య కామెడీ సీన్స్ వస్తాయి. అవి అద్భుతంగా పండుతాయి. కొండా రెడ్డి లాంటి చోటామోటా ఎర్రచందనం స్మగ్లర్లకు మంగళం శీను(సునీల్) బాస్.

పాలబండిలో సరుకును పెట్టి అమ్ముకోవాలంటూ కొండారెడ్డికి పుష్ప ఐడియా ఇస్తాడు. దీంతో కొండారెడ్డి.. పుష్ప చెప్పినట్టుగానే పాలబండిలో దుంగలు పెట్టి అక్రమంగా తరలిస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అతడి గురించి ఆరా తీయడంతో.. ఆ దుంగలను తీసుకెళ్లి.. మంగళం శీను గోడౌన్ లో దాస్తాడు కొండారెడ్డి. వాటిని పోలీసులు పట్టుకుంటారు. అయితే.. పుష్ప ఎంట్రీ ఇచ్చి.. వాటిని పోలీసుల నుంచి కాపాడుతాడు.

ఇంతలో అనసూయ ఎంట్రీ ఉంటుంది. మంగళం శీనుకు దగ్గర ఉంటుంది అనసూయ. మరోవైపు మంగళం సీన్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. అప్పుడే సమంత ఎంట్రీ ఉంటుంది. సమంత.. ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అనే పాట ప్రారంభం అవుతుంది. ఈ పాటలో సమంత హైలెట్ గా నిలుస్తుంది. స్మోకింగ్ చేస్తూ.. హాట్ హాట్ గా కనిపిస్తుంది సమంత. తన ఎక్స్ ప్రెషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే.

పాట అయిపోతుంది. ఎర్రచందనం దుంగలను మంగళం శీను ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని.. కానీ కొండారెడ్డికి తక్కువ డబ్బులు ఇస్తున్నాడని పుష్పకు తెలుస్తుంది. మరోవైపు మంగళం శీనును ఒప్పించి తనకు ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేలా చేస్తే అందులో 50 శాతం షేర్ ఇస్తా అని పుష్పకు.. కొండారెడ్డి ఆఫర్ ఇస్తాడు.

కట్ చేస్తే.. పుష్ప, శ్రీవల్లి ఎంగేజ్ మెంట్ ఆగిపోతుంది. మరోవైపు పుష్ఫ తల్లికి గాయాలు అవుతాయి. ఇంతలో ఇంటర్వెల్ సీన్ వస్తుంది. మరోవైపు మంగళం శీనుకు పుష్ప.. వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇక నుంచి ఎర్రచందనాన్ని డైరెక్ట్ గా తామే అమ్మేసుకుంటామని చెబుతాడు పుష్ప.

దీంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక డ్రామాలా నడుస్తుంది. అది కూడా ఎక్కువగా పుష్ప, కొండారెడ్డి, మంగళం శీను మధ్య నడుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే.. కొన్ని సీన్లు కొంచెం స్లోగా ఉన్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ పరంగా ఇరగదీశాడు.

Pushpa Movie review and Live Updates సెకండ్ హాఫ్ స్టార్ట్

ఇక.. శ్రీవల్లిని తన ఇంటికి రావాలంటూ కొండారెడ్డి చెబుతాడు. దీంతో పుష్ప తనతో గొడవ పడతాడు. ఆ తర్వాత వచ్చే ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంతలో సామీ సామీ పాట వస్తుంది. పుష్ప తనను కొట్టాడనే కోపంతో.. తన గ్యాంగ్ ను పుష్ప మీదికి రెచ్చగొడతాడు కొండారెడ్డి. దీంతో కొండారెడ్డి మనుషులు.. పుష్పను తీవ్రంగా కొడతారు. మరోవైపు మంగళం శీను మనుషులు.. కొండారెడ్డిని చంపేస్తారు.

అయితే.. కొండారెడ్డి కొడుకును కాపాడటం కోసం పుష్ప చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్. నేను బిజినెస్ లో ఏలు పెట్టి కెలకటానికి రాలేదు… ఏలటానికి వచ్చాను.. అని పుష్ప మంగళం శీనుతో అనే డైలాగ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత అక్కడి సిండికేట్ ను తను చేజిక్కించుకుంటాడు పుష్ప. ఆ తర్వాత ఏయ్ బిడ్డా సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇది నా అడ్డా అంటూ ది రైజ్ ఆఫ్ పుష్పను ఆ సాంగ్ లో చూపిస్తారు.

ఇంతలో ఫాహద్ ఫాసిల్ ఎంట్రీ ఉంటుంది. అతడే ఈ సినిమాలో మెయిన్ విలన్. అతడి పేరు భన్వర్ సింగ్. ఈ సినిమాలో ఎస్పీ. భన్వర్ సింగ్ రావడమే.. పుష్పతో ఢీకొంటాడు. లాస్ట్ 30 నిమిషాల సినిమా అయితే అదిరిపోతుంది. పుష్ప, భన్వర్ సింగ్ మధ్య ఫైట్ సీన్ తో సినిమా ముగుస్తుంది.

మొత్తానికి సినిమా ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా స్లోగా నడుస్తుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్ వరకు కొంచెం బోరింగ్ గా ఉంటుంది. కానీ.. ఇంటర్వల్ సీన్ నుంచి సినిమా అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. సినిమా మొత్తం అడవి బ్యాక్ డ్రాప్ లో తీసిని సినిమా. మొత్తంగా ఇది అల్లు అర్జున్ షో. ఆయన తన భుజాల మీద వేసుకొని ఈ సినిమాను నడిపించాడు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. ఆయన యాక్షన్ కానీ.. ఆయన మాట్లాడే మాట తీరు, యాస, బాడీ లాంగ్వేజ్ అన్నీ సరికొత్తగా ఉంటాయి. మెయిన్ విలన్ గా సునీల్ నూటికి నూరు శాతం సూట్ కాలేదు అనిపిస్తుంది. చివరి 30 నిమిషాల సినిమాను ఫాహద్ ఫాసిల్, అల్లు అర్జున్ తమ భుజాల మీద మోశారు.

Advertisement

Recent Posts

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

23 mins ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

1 hour ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

2 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

3 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

4 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

5 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

6 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

7 hours ago

This website uses cookies.