మేషరాశి ఫలాలు : ఈరోజు కార్యజయం కలుగుతుంది. సమాజంలో మంచి పేరు. గౌరవం లభిస్తుంది. ఇంట్లో శుభకార్య యోచన చేస్తారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. పాత బంధాలు పునరుద్ధరించుకోవడానికి మంచిరోజు. మహిళకు చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆదాయం పెరిగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని దుర్ఘటనలు. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు మానసిక అశాంతి కలిగే సూచన. దుర్గా స్తోత్రం చదువుకోండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచి రోజు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. మహిళకు స్వర్ణలాభం. అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఆనుకోని వ్యక్తుల కలయికతో లాభాలు కలుగుతాయి. మాంసం, పెయింట్ల వ్యాపారం బాగా సాగుతుంది. పదోన్నతులు, శుభవార్తలు. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీలక్ష్మీ అష్టోతరం చదువుకోండి.
Today Horoscope december 17 2021 check your zodiac signs
సింహరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో మానసిక అశాంతి కలుగుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా సాధారణ స్థితి. రుణాల కోసం ప్రయత్నం. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. బంధువులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శ్రీ అన్నపూర్ణ దేవి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఆశాంతిగా ఉంటుంది. కుటుంబంలో అనుకోని వివాదాలు రావచ్చు జాగ్రత్త. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మంచిగా సాగవు. విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. మహిళలకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. చిల్లర, కిరాణం, పాల వ్యాపారాలు బాగా సాగుతాయి. రియల్ ఎస్టేట్, వ్యవసాయ దారులకు మంచిరోజు. అనుకూల వాతావరణం. మహిళకు వస్త్ర లాభం కనిపిస్తుంది. శ్రీ అలివేలు మంగా వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఆస్తికి సంబంధించి ముఖ్య సమాచారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. విందులు, వినోదాలకు ఆహ్వానాలు వస్తాయి. మహిళకు స్వర్ణలాభం. శ్రీ గురు దత్తాత్రేయ ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. సమస్యలతో సహవాసం చేస్తారు. ప్రయాణాలు కలసిరావు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండక మానసిక అశాంతి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహిళలకు కుటుంబంలో ఇబ్బందులు. పక్కవారితో విభేదాలకు అవకాశం ఉంది. ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
మకరరాశి ఫలాలు : ఈరోజు పని వత్తిడి బాగా పెరుగుతుంది. పక్కవారితో మాటపట్టింపులు రావచ్చు. మహిళలకు ఆరోగ్య విషయంలో్ జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా సాధారణ స్తితి. వ్యాపారాలు ముఖ్యంగా పాలు, చిల్లర, కిరాణం వారికి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన, నిమ్మకాయ దీపం పెట్టడం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. శుభకార్య నిర్వహణకు ప్రయత్నం చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహిళలకు సంతోషకరమైన రోజు. అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. బంధువులు, మిత్రుల సహాయ నిరాకరణ వల్ల ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రాక మానసిక అశాంతి. కుటుంబంలో ఒడిదుడుకులు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధనతోపాటు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.