Ambajipeta Marriage Band Movie Review : అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Ambajipeta Marriage Band Movie Review : అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Cast & Crew
- Hero : Suhas
- Heroine : Nithin Prasanna
- Cast : agadeesh Prathap Bandari, Nithin Prasanna, Goparaju Ramana
- Director : Dushyanth Katikineni
- Producer : Venkatesh Maha , Dheeraj Mogilineni,Venkat Reddy, Bunny Vasu
- Music : Sekhar Chandra
- Cinematography : Wajid Baig
Ambajipeta Marriage Band Movie Review : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాస్ ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఆయన తాజాగా ‘ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా శివాని నాగారం నటించారు. జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, శరణ్యప్రదీప్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముందుగానే చూసినట్లుగా తెలుస్తుంది.
ఆయన ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేశారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాను నేను ఇప్పటికే చూశానని, ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని, సాధారణంగా సినిమా చూసేటప్పుడు కొంతసేపు ఆపేసి ఏదైనా తిందామని అనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమా చూసినప్పుడు ఎలాంటి స్టాప్స్ లేకుండా సినిమా చూశాను. అందరూ ఏం చేశారు అనే ఫీలింగ్ కలిగింది అని విజయ్ దేవరకొండ చెప్పారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో టెక్నికల్గా బాగుంది. మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆర్ట్ విభాగం సెటప్ బాగుంది. నటీనటుల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉందని ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ తెలిపారు. సినిమా ఇప్పటికే చూశాను. ఫార్మల్గా ట్రైలర్ చూశాను. బిగ్ టికెట్ లాంచ్ చేశాను. ఈ సినిమా టీమ్ అంతా నాకు తెలుసు. నిర్మాత ధీరజ్ నాకు బాగా తెలుసు. డైరెక్టర్ దుష్యంత్ డియర్ కామ్రేడ్ సినిమాకు అసిస్టెంట్ గా వర్క్ చేశారు. హీరో సుహాస్ నాతో నటించాడు.
ఈ సినిమా టీజర్ నాకు చూపించినప్పుడు దుష్యంత్ ఈ సినిమా తీశాడా అని ఆశ్చర్యం కలిగింది. టీజర్ చూసి మైండ్ బ్లోయింగ్ అనిపించింది అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఖుషి సినిమాలో నాతో శరణ్య ప్రదీప్ నటించారు. ఆమె టాలెంట్ అందరికీ తెలుసు. ఆమె కూడా అద్భుతంగా నటించారు. శివానికి ఇది తొలి సినిమా అయినా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. సుహాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని తెలిపారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా ఒక బ్యూటిఫుల్ మూవీ. మైండ్ బ్లోయింగ్. చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ అన్ని ఉన్నాయి.
Ambajipeta Marriage Band Movie Review – అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ రివ్యూ కథ:-
అంబాజీపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఊర్లో పెద్దమనిషిగా చలామణి అవుతుంటాడు వెంకట్ ( నితిన్ ప్రసన్న) . ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకొని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతుంటారు. ఆ గ్రామంలో మల్లి ( సుహాస్ ) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండ్లో పనిచేస్తుంటాడు. మల్లి అక్క పద్మ ( శరణ్య) అదే ఊర్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. పద్మకు వెంకట్ కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మి( శివాని ) , మల్లి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకొని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్ ఆత్మాభిమానంతో ఉండే మల్లి, పద్మలకు వైరం ఎలా మొదలవుతుంది. ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ ఏమవుతుంది. చివరకు వెంకట్ పరిస్థితి ఎంత మారిపోతుంది అనేది కథ.
Ambajipeta Marriage Band Movie Review – అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ రివ్యూ – విశ్లేషణ :
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో చూపించిన కథ కొత్తది ఏమీ కాదు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల కుంపటి ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు. తక్కువ కులాలకు చెందిన వారిపై ఎంతటి వివక్ష చూపించేవారు అందరికీ తెలిసిందే. కులవృత్తులు చేసుకునే వారి మీద ఎలాంటి చూపు చూసేవారు తెలిసిందే. కులాలు, పేదోళ్లు, ధనికులు, ప్రేమ అని పాయింట్ ల చుట్టూ ఎన్నో కథలు వచ్చాయి. ప్రేమ కథలు అంటే కులాలు డబ్బు ఇలా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమా కేవలం ప్రేమ కథ కాదు ప్రచార సినిమాలు చూస్తే ఇది కేవలం ప్రేమ కథ అనుకుంటే పొరపాటే. అసలు ఇది ప్రేమ కథ చిత్రం కాదు. ఆత్మాభిమానం కోసం పోరాడే ఓ మహిళ కథ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి సుహాస్ హీరో అని పోస్టర్ల మీద కనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే మాత్రం శరణ్య పోషించిన పద్మ పాత్ర హీరోలా అనిపిస్తుంది. మహిళను కేంద్రంగా చేసుకొని ఇంత బలమైన పాత్రను రాసుకోవడం ఈ మధ్యకాలంలో జరగలేదు. అసలు పద్మ పాత్రకు రాసుకున్న సీన్లు, డైలాగ్స్ కు దర్శకుడికి దండం పెట్టాల్సిందే. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఆత్మాభిమానాన్ని వదులుకోమని పద్మ పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. చావనైనా చేస్తాను అంటూ చావుకు సిద్ధపడుతుంది కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోదు. ఇక పోలీస్ స్టేషన్ లో పద్మ యాక్టింగ్ యాక్షన్ కు విజిల్స్ పడతాయి. పద్మ ఈ సినిమాకి హీరోనా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో విలన్ ను ఎగిరి కాలుతో తన్నే సీనుకు స్క్రీన్ లు చిరిగిపోవాల్సిందే. ఒక హీరోకు అలాంటి సీన్లు పెట్టడం కామన్ కానీ ఈ సినిమాలో శరణ్యకు అలాంటి సీన్లు పెట్టారు. అక్కడే డైరెక్టర్ పాస్ అవుతాడు. ఇలాంటి విలేజ్ లవ్ రేంజ్ డ్రామాలను ఇదివరకు కొన్ని వందల సినిమాలలో చూసి ఉంటాం.
కానీ ఎప్పుడు కూడా ఒక లేడీ క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్ గా చూపించలేదు. ఫస్ట్ ఆఫ్ ప్రారంభం కాస్త స్లోగా ఉన్న ప్రేమ కథ ప్రారంభం అయినప్పటి నుంచి యూత్ బాగానే కనెక్ట్ అవుతారు. కాకపోతే ముందుకు వెళుతున్న కొద్ది కాస్త సీరియస్గా సాగుతుంది. ఇంటర్వెల్ పీక్స్ కు చేరుతుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే ఎమోషనల్ గా సాగుతుంది పోలీస్ స్టేషన్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కు రొటీన్ కు భిన్నంగానే రాసుకున్నాడు. చంపటం పరిష్కారం కాదని మనలాంటి వాళ్ళు చంపితే హంతకుడు అంటారు అంటూ హీరో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. గౌరవం, పేరు తర్వాత గారు రావడానికి ఎంత కష్టపడాలో అంటూ పద్మ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. పద్మ పాత్రకు సినిమా మొత్తం కూడా మంచి డైలాగ్స్ పడ్డాయి. పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. సుహాస్ కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. నవ్వించాడు ఏడిపించాడు చివర్లో ఎమోషన్స్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అద్భుతంగా అనిపించాడు. శివాని పోషించిన పాత్ర బాగానే ఉంది. విలన్ గా నితిన్ ప్రసన్న న్యాయం చేశాడు. చివర్లో అలా కనిపించేందుకు ఒప్పుకున్నందుకు ఆ డేరింగ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జగదీష్ కు మంచి పాత్ర పడింది. పుష్ప కేశవ తర్వాత ఈ సంజీవ్ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది.
ప్లస్ పాయింట్స్ :-
నటన
శరణ్య పాత్ర
ఎమోషన్స్
డైలాగ్స్
ఇంటర్వెల్
మైనస్ పాయింట్స్ :-
ఫస్ట్ హాఫ్ స్లో