Bimbisara Movie Review : బింబిసార ఫ‌స్ట్ రివ్యూ ఔట్.. నంద‌మూరి ఫ్యాన్స్‌కి ఇక పూన‌కాలే..!

Advertisement

Bimbisara Movie Review : ఇప్పుడు అంద‌రి దృష్టి క‌ళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం పై ఉంది. ఈ సినిమా ప్రేక్ష‌కులు మెచ్చేదిగా ఉంటుంద‌ని క‌ళ్యాణ్ రామ్ అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. బింబిసార చిత్ర కథను 2019లో దర్శకుడు వశిష్ట చెప్పాడు. నాకు బాగా తెలిసిన కుర్రాడు కావడం, అప్పుడప్పుడు కథలు చెబుతుండే వాడు. మొదటిసారి కథ చెప్పినప్పుడు బేసిక్ లైన్ చెప్పాడు. బింబిసారలోని క్రూరత్వంతో కూడిన పాత్ర లేదు. ఆ తర్వాత వశిష్ట పాత్రలను, కథను బాగా డెవలప్ చేశాడు.

Advertisement

కథ నచ్చడం వల్ల కొత్త దర్శకులతో పనిచేశాను అని కల్యాణ్ రామ్ చెప్పారు. ఇక ఈ సినిమా క‌థ ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 టైంలో న‌డుస్తుండ‌డంతో చాలా భాగం గ్రాఫిక్స్‌తో న‌డిచే సీన్లు ఉంటాయ‌ట‌. సినిమా అయితే ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌ని అంటున్నారు. గ‌తంలో బాల‌య్య నటించిన ఆదిత్య 369 టైమ్ ట్రావెల్ కథాంశంతోనే వచ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఇప్పుడు అబ్బాయ్ క‌ళ్యాణ్‌ రామ్ న‌టిస్తోన్న ఈ టైమ్ ట్రావెల్ స్టోరీ ఎలా ఉంటుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా, ఓ రోజు ముందే ఫ‌స్ట్ రివ్యూ వ‌దిలాడు ప్ర‌ముఖ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు.

Advertisement

బింబిసార మూవీ ఫుల్‌ రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Bimbisara Movie first review out
Bimbisara Movie first review out

Bimbisara Movie Review : ఫ‌స్ట్ రివ్యూ..

క‌ళ్యాణ్‌రామ్ సినిమాల‌కు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా బింబిసార‌కు పాజిటివ్ టాక్ బాగా వ‌చ్చింది. ప్ర‌ముఖ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు బింబిసార ఫ‌స్ట్ రివ్యూ నంద‌మూరి అభిమానులు కాల‌ర్ ఎత్తుకునేలా ఇచ్చాడు. క‌ళ్య‌ణ్ రామ్ ప‌ర్‌ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే మూవీని ఆకాశానికి ఎత్తాడు. ఈ చిత్రం విజువ‌ల్ ఫీస్ట్‌గా ఉంద‌ని అంటున్నాడు. మ‌రి ఈ సినిమా జాత‌కం ఏంట‌నేది తెలియాలంటే మ‌రి కొద్ది గంట‌లు వేచి చూడాలి.

బింబిసార మూవీ ఫుల్‌ రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Advertisement
Advertisement