Bimbisara Movie Review : బింబిసార మూవీ ఫస్ట్ రివ్యూ… ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bimbisara Movie Review : బింబిసార మూవీ ఫస్ట్ రివ్యూ… !

 Authored By sandeep | The Telugu News | Updated on :4 August 2022,11:58 pm

Bimbisara Movie Review : నంద‌మూరి హీరోల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు క‌ళ్యాణ్ రామ్ nandamuri kalyan ram. విభిన్న కథా చిత్రాలు చేసిన కూడా అందులో కొన్ని మాత్ర‌మే క‌ళ్యాణ్ రామ్‌కి స‌క్సెస్ అందించాయి. ఇప్పుడు భారీ అంచ‌నాల‌తో బింబిసార అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఆగ‌స్ట్ 5న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వ‌శిష్ట్ అనే కొత్త ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందగా, మూవీ ఎలాంటి విజ‌యం సాధిస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ అవైటెడ్ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్ సహా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కూడా ఉండొచ్చని కూడా టాక్ వచ్చింది.

Bimbisara Movie Review : అంచ‌నాలు పీక్స్‌లో..

తెలుగులో సినిమా తాము అనుకున్న విధంగా హిట్టయితే ఈ ఆగస్ట్ మూడో వారంలో అలా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇటీవ‌ల మూవీకి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు క‌ళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. బింబిసార మేకవర్ కొత్తగా ఉంటుంది. ఒక కొత్త క్యారెక్టర్‌ను ఆకలింపు చేసుకోవడంలోను, ఒక రాజుగా నేను సెట్ అవుతానా? నా డిక్షన్ సెట్ అవుతుందా? అనే డౌట్ ఉండేది. తాతగారు, బాబాయ్ చేసిన సినిమాలు, బాహుబలి, మగధీర సినిమాలను కొంత రెఫరెన్స్ తీసుకొన్నాను. దాదాపు రెండు నెలలు బాగా ఎక్సరైజ్ చేశాను. ఈ సినిమాకు బాహుబలి సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా టైమ్ ట్రావెల్, సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆధారంగా తెరకెక్కించాం అని కల్యాణ్ రామ్ చెప్పారు.

Bimbisara Movie Review And Live Updates

Bimbisara Movie Review And Live Updates

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. రీసెంట్‌గా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు. సినిమా చూసిన కొంద‌రు ప్ర‌ముఖులు.. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. వారి ఆటలను బింబిసారుడుగా మళ్లీ జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా అంతం చేసాడనేదే ఈ సినిమాగా కనబడుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ గెటప్ బాగుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్…

Bimbisara Movie Review  : బింబిసార మూవీ రివ్యూ..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే . ఆయ‌నకు ఇటీవ‌లి కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడు బింబిసార చిత్రంపై బోలెడ‌న్ని అంచ‌నాలు పెట్టుకున్నారు. నూతన దర్శకుడు వశిష్ఠ్ డైరెక్షన్‌లో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. టైమ్ ట్రావెల్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 5) విడుదల అయింది. కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ‘బింబిసార ఎలా ఉందో చూద్దాం.

Bimbisara Movie Review  క‌థ‌:

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ కథ మొదలైంది. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు (కళ్యాణ్ రామ్) క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం గొప్ప రాజు. అతనికి ఎదురు లేని కాలం అది. బింబిసారుడు మ‌ర‌ణించి డిజిట‌ల్ యుగంలో మ‌ళ్లీ పుడ‌తాడు. మ‌గ‌ధీర‌లో మాదిరిగా ఇందులో కూడా ఆయ‌న‌కు గ‌తం వెంటాడుతూ ఉంటుంది. తనకు చెందిన నిధిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బింబిసారుడు జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటీ ?, అతని జీవితం ఎలా మారింది ?, చివరకు అసలేం జరిగింది ?, అసలు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

Bimbisara Movie Review  ప‌నితీరు:

బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరన్నట్లు నందమూరి హీరో యాక్ట్ చేసాడు.. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం భూజాలపై మోసాడు . కేథరిన్, సంయుక్త మీన‌న్ కూడా త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. స్టోరీ సూపర్‌గా ఉంది.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఓ రేంజ్‌లో ఉన్నాయి. కొత్త ద‌ర్శ‌కేడ అయిన వ‌శిష్ట్ చిత్రాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. చోటా కె నాయుడు కెమెరా ప‌నిత‌నం కూడా బాగుంది.

చివ‌రి మాట‌: అంద‌రు ఊహించిన‌ట్టే సినిమా అదిరిపోయింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ కూడా అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమా బింబిసార‌. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఫీస్ట్ అందించ‌డం ఖాయం.

రేటింగ్ 3.5

సీతారామం మూవీ ఫుల్‌ రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది