Valentine’s Day : ప్రేమికుల రోజు బంపర్ ఆఫర్.. రూ.389 లకే బాయ్ ఫ్రెండ్
ప్రధానాంశాలు:
Valentine's Day : ప్రేమికుల రోజు బంపర్ ఆఫర్.. రూ.389 లకే బాయ్ ఫ్రెండ్
Valentine’s Day : ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమికుల రోజు లవర్స్ హంగామా ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. అయితే బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి . రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు .

Valentine’s Day : ప్రేమికుల రోజు బంపర్ ఆఫర్.. రూ.389 లకే బాయ్ ఫ్రెండ్
Valentine’s Day స్పెషల్ పోస్టర్స్..
ఇక ఈ పోస్టర్లపై ప్రేమికుల దినోత్సవం ఒక బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోండి, స్కాన్ చేయండి అని రాసుకొచ్చారు. అంతేగాదు QR కోడ్ కూడా ఇచ్చారు. వీటిని జయనగర్, బనశంకరి, BDA కాంప్లెక్సులు వంటి ప్రదేశాల్లో అతికించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ పోస్టర్లపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు.
ఇది మన సంస్కృతికి భంగం కలిగించే విషయమని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . అయితే ఇలా వాలెంటైన్స్ డే రోజున పోస్టర్లు వెలియడం ఇదే తొలిసారి కాదు. 2018లో మహారాష్ట్రలోని ముంబైలో “రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్” అనే యాప్ ప్రారంభమైంది. పురుషులకు ఉద్యోగ ప్రకటనలు కూడా ఇచ్చింది.