Valentines Day : సుడిగాలి సుధీర్‌కు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రష్మీ.. పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Valentines Day : సుడిగాలి సుధీర్‌కు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రష్మీ.. పెళ్లి ఫిక్స్ అయినట్టేనా?

 Authored By kranthi | The Telugu News | Updated on :14 February 2023,1:00 pm

Valentines Day : అందరికీ తెలుసు. ఇవాళ వాలంటైన్స్ డే అని. అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడుపుతారు. ప్రేమికుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుంటారు. ఈరోజు ఏ ప్రేమికులు అయినా ఖచ్చితంగా కలుసుకుంటారు. ఎంతదూరంలో ఉన్నా సరే.. ప్రేమికులు వాలంటైన్స్ డే నాడు కలుసుకుంటారు. తమ ప్రేమను ఒకరితో మరొకరు పంచుకుంటారు.తెలుగు బుల్లితెర మీద బాగా ఫేమస్ అయిన జంట అంటే..

రష్మీ, సుడిగాలి సుధీర్ అనే చెప్పుకోవాలి. ఆ జంటకు వచ్చినంత క్రేజ్ మరే జంటకు రాలేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా? లేదా? అంతా ఉత్తుత్తేనా అనేది పక్కన పెడితే.. ఆ జంటకు ఉండే పాపులారిటే వేరు. ఒకరకంగా చెప్పాలంటే జబర్దస్త్ కు అంత క్రేజ్ రావడానికి కారణం రష్మీ, సుధీర్ అనే చెప్పుకోవాలి. ఇవాళ వాలంటైన్స్ డే కదా. ఈ సందర్భంగా ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో సుడిగాలి సుధీర్, రష్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు హైపర్ ఆది.ఈ వాలెంటైన్స్ డే నాడు మా సుధీర్ అన్నకు ఏ గిఫ్ట్ ఇస్తున్నావు అంటూ స్టేజ్ మీదే అందరి ముందు రష్మీని అడిగాడట హైపర్ ఆది. సుడిగాలి సుధీర్ గురించి చెప్పగానే రష్మీ..

Valentines Day : సుధీర్ పేరు వినగానే ముసిముసి నవ్వులు నవ్విన రష్మీ

తెగ సిగ్గుపడిపోయిందట. చాలాసేపు ముసిముసినవ్వులు నవ్విందట రష్మి. వాళ్ల బాండింగ్ గురించి తెలిసిన హైపర్ ఆది.. మరి మా అన్నకు ఏమిస్తున్నావు అంటూ అడుగుతాడు. దీంతో సిగ్గుపడిపోయిన రష్మీ.. ఏం మాట్లాడుకుండా అలాగే ఉండిపోయింది. అంటే.. సుధీర్ మీద అంతో ఇంతో తనకు ప్రేమ ఉన్నట్టే కదా. వీళ్లిద్దరు ఎప్పుడు ఒక్కటవుతారా అని  సుధీర్, రష్మి అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. చూద్దాం మరి.. వాలంటైన్స్ డే రోజు రష్మీ.. సుధీర్ కు ఏం గిఫ్ట్ ఇస్తుందో? త్వరలోనే ఈ జంట ఓ సినిమాలో నటించబోతున్నారట. అంటే..ఇద్దరి రొమాన్స్ ను త్వరలోనే వెండి తెర మీద చూడబోతున్నామన్నమాట.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది