DJ Tillu Movie Review : డీజే టిల్లు అనే సినిమా నిజానికి చిన్న సినిమా. కానీ.. ఈ సినిమాకు హైప్ రావడానికి కారణం.. ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. అవును.. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, డీజే టిల్లు టైటిల్ సాంగ్ తో సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అట్లుంటది మనతోని అంటూ క్యాప్షన్ పెట్టి.. తెలంగాణ యాస కాదు కాదు.. పక్కా హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను మెప్పించడం కోసం రంగంలోకి దిగాడు డీజే టిల్లు. మరి.. ఈ డీజే టిల్లు ప్రేక్షకులను మెప్పించాడా? సినిమా కథ ఎలా ఉంది.. ప్రేక్షకులను డీజే టిల్లు ఎంత వరకు ఎంటర్ టైన్ చేయగలిగాడు.. అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
మన హీరో పేరు డీజే టిల్లు కాదు.. బాల గంగాధర్ తిలక్. కానీ.. అందరూ డీజే టిల్లు అని పిలుస్తుంటారు. ఒక సాధారణ యువకుడే. కానీ.. ఎలాగైనా డీజే అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. దాని కోసమే కష్టపడుతుంటాడు. డీజే అవ్వడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తనకు నేహా శెట్టి పరిచయం అవుతుంది. తన పేరు రాధిక. నిజానికి.. రాధిక ప్రొఫెషనల్ సింగర్. కానీ.. తను ఒక హత్య కేసులో చిక్కుకుంటుంది.
ఆ హత్య కేసు నుంచి రాధికను తప్పించడం కోసం డీజే టిల్లు చాలా కష్టపడతాడు. కొన్నిసార్లు తానే సమస్యలో ఇరుక్కుంటాడు. అయితే.. తన సమస్యలు తెలియకముందే రాధికను ప్రేమిస్తాడు టిల్లు. కానీ.. హత్య కేసు విషయం, తర్వాత మరికొన్ని ఘటనలు జరగడంతో తనను అనుమానించడం మొదలు పెడతాడు. మరి.. తనను అసలు టిల్లు ఎందుకు అనుమానిస్తాడు. రాధిక ఏ హత్య కేసులో చిక్కుకుంటుంది.. ఆ తర్వాత ఇద్దరూ కలుస్తారా? లేక విడిపోతారా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
DJ Tillu Movie Review: డీజే టిల్లు సినిమా రివ్యూ… అస్సలు తగ్గలే.. రెచ్చెపోయిన సిద్దు
DJ Tillu Movie Review :సినిమా పేరు : డీజే టిల్లు
నటీనటులు : సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రగతి, బ్రహ్మాజి, ప్రిన్స్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : విమల్ కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్
విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2022
ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. ముందు చెప్పాల్సింది సిద్దు గురించే. అవును.. సిద్దు వన్ మ్యాన్ షోలాగా ఈ సినిమాలో నటించాడు. సినిమాను ఒక్కడే తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఇక.. హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా.. సిద్దూను డామినేట్ చేస్తూ నటించింది. ఏమాత్రం తగ్గలేదు. సిద్దూకు తగ్గ హీరోయిన్ అనిపించుకుంది. ఇక.. రొమాంటిక్ సీన్లలో అయితే సిద్దు రెచ్చిపోయి నటించాడు. ఏమాత్రం తగ్గలేదు. మొత్తానికి ఒక ప్యాకేజీలా ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను ప్రేక్షకులకు సిద్దు ఇచ్చాడు.
ఎందుకంటే.. ఈ సినిమాకు కథ అందించింది సిద్దునే. స్క్రీన్ ప్లే కూడా సిద్దూనే చూసుకున్నాడు కాబట్టి.. సినిమాను తన యాంగిల్ లో మార్చుకుని ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని నూటికి నూరు శాతం అందించాడు.
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
సినిమాలోని డైలాగ్స్
సోఫిస్టికేటెడ్ మ్యూజిక్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సిద్దు క్యారెక్టరైజేషన్
రొమాంటిక్ సీన్స్
హీరోయిన్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉంటాయి
సిల్లీ ప్లాట్
స్లోగా కథనం
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ఒక రెండున్నర గంటలు థియేటర్ లో రిలాక్స్ అయి నవ్వుకొని రావాలని అనుకుంటే మాత్రం ఈ సినిమాకు తప్పకుండా వెళ్లొచ్చు. లాజిక్స్ వెతక్కుండా.. హ్యాపీగా సినిమాను ఎంజాయ్ చేసి రావచ్చు.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 2.75/5
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.