F3 Movie Review : ఎఫ్3 మూవీ ఫస్ట్ రివ్యూ..!
F3 Movie Review : ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఉండే సినిమాలకే. ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించడంలో నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించాడు విక్టరీ వెంకటేశ్. గత 30 సంవత్సరాల నుంచి విక్టరీ వెంకటేశ్ కు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికే ఎఫ్ 2 పేరుతో వచ్చిన సినిమాలో వెంకటేశ్ పండించిన కామెడీని ఇప్పటికీ మరిచిపోలేదు సగటు తెలుగు ప్రేక్షకుడు. ఎఫ్ 2 లో నటించిన నటీనటులతోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇవాళ వచ్చాడు.
ఈ సినిమాలో వెంకటేశ్ తో పాటు మరో హీరోగా వరుణ్ తేజ్ నటించాడు. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. వెంకటేశ్ సరసన తమన్నా నటించగా.. వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ఎఫ్ 2 లో ఉన్న ఫన్ కంటే ఈ సినిమాలో కామెడీ డోస్ ను పెంచినట్టు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది.

F3 Movie Review And Live Updates
F3 Movie Review : ఎఫ్3 మూవీ ఫస్ట్ రివ్యూ..!
F3 Movie Review : సినిమా పేరు : ఎఫ్3
నటీనటులు : వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, ఆలీ, ప్రగతి, అన్నపూర్ణ, వై విజయ, మురళీ శర్మ, రఘుబాబు తదితరులు
డైరెక్టర్ : అనిల్ రావిపూడి
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్
రిలీజ్ డేట్ : 27 మే 2022
ఇక.. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, సునీల్, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రల్లో నటించారు. 2019 సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 మూవీ రచ్చ రచ్చ చేసింది. మళ్లీ రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా ఎఫ్2 ను మించి ఫన్ ను అందిస్తుందని తెలియడంతో తెలుగు ప్రేక్షకులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ 3 సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ప్రదర్శించారు. మరి.. సినిమా ఎలా ఉందో దాని లైవ్ అప్ డేట్స్ తెలుసుకుందాం రండి.
ఈ సినిమా కథ విజయనగరంలో ప్రారంభం అవుతుంది. వెంకీ(వెంకటేశ్) తమన్నా ఫ్యామిలీకి అప్పు ఇస్తాడు. వెంకీకి డబ్బు అంటే ఆశ. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. మరోవైపు వరుణ్ యాదవ్(వరుణ్ తేజ్) బాగా డబ్బు సంపాదించి గొప్పవాడు కావాలని కలలు కంటూ ఉంటాడు.కట్ చేస్తే మురళీ శర్మ ఎంట్రీ.. డబ్బు వల్ల ఫన్ తో పాటు ఫ్రస్ట్రేషన్ ఎలా వస్తుందో చెబుతాడు. ఆ తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేయలేక వెంకీ ఫ్రస్ట్రేషన్ కు గురవుతుంటాడు.మరోవైపు వరుణ్ యాదవ్, సునీల్ మధ్య కొన్ని కామెడీ సీక్వెన్సులు వస్తాయి. వరుణ్ యాదవ్ కు నత్తి, వెంకీకి రేచీకటి. తన రేచీకటి వల్ల వెంకీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సినిమాకు వెంకటేశ్ హైలైట్. తనే ఈ సినిమాను భుజాల మీద మోశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఆయన కామెడీ టైమింగ్ అదుర్స్. సునీల్ కూడా మళ్లీ తను గొప్ప కమెడియన్ అని ఈ సినిమా ద్వారా నిరుపించుకున్నాడు.
సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. వెంకీ, వరుణ్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయి. వరుణ్, వెంకీ ఇద్దరూ మంగ గ్యాంగ్ తో తలపడతాడు.
ఆ తర్వాత ఆలీ కామెడీ ట్రాక్ వస్తుంది. అది మాత్రం అదిరిపోతుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక స్టోరీ అంటూ లేదు కానీ.. సినిమా మొత్తం ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్.కట్ చేస్తే సినిమా కథ మళ్లీ విజయనగరానికి మూవ్ అవుతుంది. అక్కడ కూడా వెంకీ, వరుణ్, హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ మధ్య కామెడీ సీన్స్ వస్తాయి.తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్స్ ను సినిమాలో పరిచయం చేస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్ వస్తుంది. ఐటెమ్ సాంగ్ లో పూజా హెగ్డ్ మెరిసిపోయింది.తర్వాత ఒక మంచి మెసేజ్ తో సినిమా ముగుస్తుంది. సినిమాను ప్రారంభించిన మురళీ శర్మనే సినిమాను ముగుస్తాడు. హార్డ్ వర్క్, డబ్బు గురించి ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత సినిమా ముగుస్తుంది.
-
ఇవి కూడా చదవండి..
-
Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?
-
Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్.. సామ్ షాకింగ్ రిప్లయ్..!
-
Shani jayanthi : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం..