Seethamma vakitlo sirimalle chettu| సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకీ, మహేష్ పేర్లు అవా.. సీక్రెట్ బయటపెట్టిన శ్రీకాంత్
Seethamma vakitlo sirimalle chettu| తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. మహేష్ బాబు, వెంకటేశ్ కలిసి నటించిన ఈ హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి కుటుంబ విలువలు, అనుబంధాల మధ్య జరిగే భావోద్వేగాల్ని అందంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, విడుదలైన సమయంలోనే ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందనను తెచ్చుకుంది.
#image_title
అసలు కథ ఇది..
మహేష్ బాబు హాస్యం , వెంకటేశ్ అభినయం, ఇద్దరి మధ్య స్నేహబంధం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాశ్ రాజ్ వంటి తారాగణం తమ పాత్రల్లో జీవించి నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతల మదిలో నిలిచిపోతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
టీవీల్లో వచ్చినా చూడకుండా ఉండలేనంతగా అభిమానులు అభిమానించేవారు ఈ సినిమాను… ఇప్పుడు బిగ్ స్క్రీన్‌లో చూసే అవకాశం రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు.ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తొలుత వెంకటేశ్ పాత్రకు “మల్లికార్జున”, మహేష్ పాత్రకు “సీతా రామరాజు” అనే పేర్లు పెట్టాలనుకున్నారట. కానీ సినిమాలో అంజలి పాత్ర పేరు “సీత” కావడం వల్ల, ప్రేక్షకులకు అయోమయం కలగవచ్చని భావించి చివరకు వీరిని “పెద్దోడు – చిన్నోడు” అని మాత్రమే సంబోధించేలా కథను మార్చారని తెలిసింది. మళ్ళీ రాముడు–లక్ష్మణుడు అనే పేర్లు ట్రై చేసినా, చివరికి ఫ్యామిలీ కెనెక్షన్‌ను హైలైట్ చేయడానికే పెద్దోడు–చిన్నోడు అనే పిలుపునే ఉపయోగించినట్టు సమాచారం.