Gamanam Movie Review : గమనం మూవీ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gamanam Movie Review : గమనం మూవీ రివ్యూ..!

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2021,9:45 am

Gamanam Movie Review : రిగిపోతోంది. రొటీన్‌కి భిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ కొత్త తరం దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. చందమామ కథలు, కంచెర పాలెం వంటి సినిమాలు కొత్త జానర్ లో వచ్చి సూపర్ హిట్ లుగా నిలిచాయి. అదే కోవలో తెరకెక్కిన చిత్రమే గమనం. సీనియర్ హీరోయిన్‌ శ్రియా లాంగ్ గ్యాప్ తో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహిళా దర్శకురాలు సుజనా రావు దర్శకత్వంలో తొలి సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి తో పాటు నిత్యా మీనన్‌ అతిధి పాత్రలో మెరిశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ ఏమిటంటే : ఈ చిత్రం ప్రధానంగ హైదరాబాద్ స్లమ్ ఏరియాలోని ఓ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. దివ్యంగురాలు కమల(శ్రియ) టైలర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు వినికిడి లోపం ఉన్న కారణంతో ఆమెను తన భర్త వదిలేస్తాడు. ఏ దిక్కు లేక టైలరింగ్‌ చేసుకుంటూ తన పిల్లాడిని పోషించుకుంటూ కష్టాల్లో గడుపుతూ ఉంటుంది. అదే బస్తిలోని మరో అబ్బాయి అలీ ( శివ కందుకూరి ) ఇండియన్ టీమ్ లో క్రికెటర్‌ గా సెలెక్ట్ అవ్వాలని తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన అటూ తన కెరియర్ లోనూ సక్సెస్ అవ్వక .. ఇటు తన ప్రియురాలు జరా (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఇబ్బందుల్లో పడతాడు. అలీ కోసం జరా తన ఇంటిని వదిలి వచ్చేస్తుంది. వీరితో పాటు కథ మరో ఇద్దరు వీధి బాలల వైపు వెళ్తూ ఉంటుంది.

Gananam Movie review

Gananam Movie review

పాత సామాను అమ్ముకొని జీవనం సాగిస్తున్న ఇద్దరూ చిన్నారుల్లో ఒకరికి తమ పుట్టినరోజును అందరిలాగే గ్రాండ్ గా చేసుకోవాలని ఆశ పుడుతుంది. ఆ కారణంగా ఆ పిల్లాడు.. తన బర్త్ డే కేక్ కి కావాల్సిన డబ్బు కోసం తీవ్రంగా కష్టపడుతుంటాడు. ఇలా ఈ మూడు పాత్రలు హైదరబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటాయి. ఆ ఆపద నుంచి వీరంతా బతికి బయటపడ్డారా… ఆ తర్వాతా కమల ఏమై పోయింది? తన పిల్లాడిని కాపడుకొగలిగిందా..? అలీ, జరా పెళ్లి చేసుకున్నారా? ఆ బస్తీ పిల్లాడు తన బర్త్ డే ను తాను అనుకున్నట్టుగా గ్రాండ్ గా కేకే తో సెలెబ్రెట్ చేసుకున్నాడా? అనేది అసలు కథ.

Gamanam Movie Review : ఎలా ఉందంటే

నేటికీ ఎన్నో లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరుగుతున్నా అనేక సంఘటనలే మనం ఈ చిత్రంలోనూ చూస్తాం. నిస్సహాయత స్థితిలో ఉన్న పేద మనుషుల్లో జరిగే అంతర్గత సంఘర్షణను ప్రేక్షకుల కళ్ళకు కట్టే చిత్రమిది. భర్త చేతిలో మోసపోయి.. వినికిడి లోపంతో తన కాళ్ల మీద తాను నిలబడ్డ ఓ మహిళ పాత్ర ఓ వైపు ఏడిపిస్తూనే హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. తన కెరీర్ కోసం తాపత్రయ పడే ఓ యువకుడికి తమ ప్రేమ విషయంలో వచ్చిన అడ్డంకులు ఎంతో మంది యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. వీరితో పాటు మధ్య మధ్యలో స్క్రీన్ పైకి వచ్చే ఇద్దరు బాలుల కథలు నవ్విస్తూనే మనను ఆలోచింప చేస్తాయి. వీధి బాలల జీవితంలో తమకు ఉండే చిట్టి చిట్టి కోరికలు హృదయాలను కదిలిస్థాయి.

Gananam Movie Review : ఎవరెలా చేశారంటే

ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది సుజనా రావు ఎంచుకున్న నటీనటుల గురించి.. తను రాసుకున్న 3 కథలకి పర్ఫెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. భర్త నుండి దూరమై చిన్న పిల్లాడితో నిస్సహాయత స్థితిలో బాధ పడుతున్న దివ్యాంగురాలి పాత్రలో శ్రియ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ పాత్రకు తను తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అనే విధంగా నటించింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చైల్డ్ అరిస్ట్స్ ల గురించి… వీధి బాలుల పాత్రలో నటించిన ఆ చిన్నారిలిద్దరూ ఆ పాత్రల్లో జీవించారు. ఇక ప్రేమికులుగా శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, అతిధి పాత్రల్లో నిత్యా మీనన్, బిత్తిరి సత్తి తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

– కథ

– శ్రియ యాక్టింగ్

– ప్రధాన పాత్రల నటన

– ఇళయరాజా నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

– స్లో నేరేషన్

– స్క్రీన్ ప్లే

చివరగా :

ప్రయత్నం మంచిదే. ప్రతీ ఒక్కరిలో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలగడం ఖాయం. కానీ ఇటువంటి ఆర్ట్ సినిమాలకు మొదటి నుంచి వసూళ్లు అంతగా రావు. మరి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

రేటింగ్‌ : 3

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది