HIT 2 Review : సినిమా పేరు.. హిట్ 2
దర్శకుడు.. శైలేష్ కొలను
నటీనటులు.. అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
నిర్మాతలు.. ప్రశాంతి తిపిరనేని, నాని
సంగీతం.. ఎం.ఎం.శ్రీలేఖ. , సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ.. ఎస్.మణికందన్
అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీకి శైలేష్ కొలను డైరెక్టర కాగా, నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై అతని సోదరి ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మించారు. రెండేళ్ల క్రితం ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందగా, ఇప్పుడు ఆ మూవీలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమాలో అడవి శేష్ లీడ్ రోల్ పోషించాడు. క్రైమ్ థ్రిలర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ : కేడి(అడివి శేష్) వైజాగ్‌లో పోలీస్ అధికారి ప్రవృత్తిని నిర్వర్తిస్తుండగా, అతను ఎప్పుడూ తనను ఛాలెంజ్ చేసే కేసులను ఛేదించడానికి ఎంతగానో ఇష్టపడతాడు. ఎన్నో ఆ కేసులను పరిష్కరించడంలో ఆయన విజయం సాధించాడు . అయితే సంజన కేసును తీసుకున్న తర్వాత అతను ఎప్పుడు లేనంత పెద్ద సవాలును ఎదుర్కొంటాడు. దర్యాప్తు ప్రక్రియలో అతనికి హంతకుడి గురించి కొన్ని నిజాలు తెలియడంతో కథ ఊహించిన మలుపు తిరుగుతుంది. సంజనని హత్య చేసిన హంతకుడు దొరుకుతాడా, కథలో ఎన్ని సవాళ్లు ఎదురవుతాయి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్ :చిత్రంలో పధాన పాత్ర పోషించిన అడివి శేష్ థ్రిల్లర్ సినిమాలతో ఎంతగా మెప్పిస్తాడనేది మనందరికి తెలిసిందే. హిట్ 2 మూవీలో కూడా అడివి శేష్ తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఇక కథానాయిక మీనాక్షి నటనకు పెద్దగా స్కోప్ లేదు. రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో కనిపించి అలరించారు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్ : మొదటి కేసుతో డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పించిన శైలేష్ కొలను హిట్ 2 తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. కథకోసం ఎంత పరిశోధించాడో స్పష్టంగా మనకు తెర మీద కనిపిస్తుంది. నెమ్మదిగా కథనం ఉన్నప్పటికీ అతను ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు. మణికందన్ తన విజువల్స్‌తో ఎంతగానో ఆకట్టుకున్నాడు, ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. స్టీవర్ట్ ఎదూరి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, మిగిలిన సాంకేతిక బృందం తమ వంతు కృషి చేసారు.
ప్లస్ పాయింట్లు : ఆకట్టుకునే సన్నివేశాలు
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్లు : నెమ్మదిగా సాగే కథనం
ఎమోషన్ సీన్స్
చివరిగా.. హిట్ 2 అనేది అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవలసిన మంచి థ్రిల్లర్ చిత్రం అని చెప్పవచ్చు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారు ఈ మూవీని ఎంతో ఆస్వాదిస్తారు.
రేటింగ్ 2.75/5
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.