Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Devara Movie Review : RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవరలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.దేవర సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ లో కొద్దిగా చెప్పే ప్రయత్నం చేశారు. సముద్రం నేపథ్యంలో కథ సాగుతుంది. భయం […]
ప్రధానాంశాలు:
Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Devara Movie Review : RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవరలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.దేవర సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ లో కొద్దిగా చెప్పే ప్రయత్నం చేశారు. సముద్రం నేపథ్యంలో కథ సాగుతుంది. భయం అంటే ఏంటో తెలియని కొందరికి దాన్ని దేవర పరిచయం చేస్తాడు. ముఖ్యంగా దేవర లో దేవర ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది. వర పాత్ర మొత్తం ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ దేవర ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.
దేవర సినిమాకు కొరటాల శివ రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా తారా స్థాయి అంచనాలతో ఉన్నారు. సినిమా ను ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వస్తారో వాటికి ఏమాత్రం తగ్గకుండా సిద్ధం చేశారని తెలుస్తుంది. దేవర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది.సినిమా నార్త్ అమెరికా లో రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2.5 మిలియన్ మార్క్ అందుకుంది. ఇదో రకంగా ఎవర్ గ్రీన్ రికార్డ్ అని చెప్పొచ్చు. దేవర సినిమా విషయం లో ఇండస్ట్రీ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా తెలుగు సినిమా స్థాయి ఏంటన్నది ప్రూవ్ చేస్తుందని నమ్ముతున్నారు.
దేవర సినిమా మీద బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా లో జాన్వీ, సైఫ్ ఉండటం వల్ల సినిమా కు అక్కడ రేంజ్ పెరిగింది. తప్పకుండా బీ టౌన్ ఆడియన్స్ ను కూడా దేవర అలరించే స్టఫ్ ఉందని తెలుస్తుంది. దేవర సక్సెస్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఉన్నారు.
RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన భారీ సినిమా దేవర.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
Devara Movie Review కథ :
ఎర్ర సముద్రం తీరంలో దట్టమైన అడవిలో కొండ ప్రాంతంలో రత్నగిరి లో దేవర (ఎన్టీఆర్), భైరా (సైఫ్ అలీ ఖాన్) శ్రీకాంత్ లు కలిసి వేటకు వెళ్తూ జీవితం సాగిస్తుంటారు. ఐతే వారికి మురుగ (మురళి శర్మ) డబ్బు వచే పని చెబుతాడు. అధికారుల కళ్లు గప్పి సరుకుని ఈ గ్యాంగ్ తరలించేలా చేస్తారు. ఐతే దేవరకు అది ఇష్టం ఉండదు. భైరా దేవర అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. విషయం తెలిసిన దేవర ఏం చేశాడు..? ప్రాణ స్నేహితుల మధ్య వైరం ఎలా నడిచింది..? దేవర కొడుకు వర ఎందుకు పిరికివాడు అయ్యాడ్..? తంగం పాత్ర ఏంటి అన్నది సినిమాలో చూడాల్సిందే.
Devara Movie Review విశ్లేషణ :
కొరటాల శివ కథ మొదలు పెట్టడం భారీగానే మొదలు పెట్టాడు. ఫస్ట్ హాఫ్ కూడా కొంతమేరకు హై మూమెంట్స్ తో నడిపించాడు. ఇంటర్వెల్ కూడా బాగానే డిజైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. ఐతే సెకండ్ హాఫ్ సినిమాను నిలబెడుతుంది అనుకుంటే అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సినిమాకు ఆయువు పట్టు కావాల్సిన సెకండ్ హాఫ్ అనవసరమైన డ్రాగింగ్ తో ట్రాక్ తప్పేసింది.ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్ తో ఉన్నా దానికి తగినట్టుగా డైలాగ్స్ కానీ హై మూమెంట్స్ కానీ లేవు. కొరటాల శివ ఎందుకో ఈ విషయంలో సరిగా వర్క్ అవుట్ చేయలేదనిపిస్తుంది. ఇక షార్క్ ఫైట్ లో వి.ఎఫ్.ఎక్స్ సీన్స్ కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా మీద మితిమీరిన అంచనాలు కూడా దేవరకు దెబ్బ వేశాయని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ ఎనర్జీని కొరటాల శివ కొంతమేరకు వాడుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా యుటిలైజ్ చేసుకోలేదని మాత్రం అనిపిస్తుంది. దేవర సినిమా చూస్తున్నంత సేపు ఏదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది కానీ ఎక్కడ ఆడియన్స్ కు హై మూమెంట్ అనిపించదు. ఆచార్యలో పాదగట్టం లానే ఇక్కడ కూడా రత్నగిరి అక్కడ నలుగురు పెద్ద మనుషులుగా ఉండి ఆ ప్రజల బాగోగులు చూడటం ఇదంతా కొరటాల సెటప్ బాగనఏ చేశాడు.సినిమా అంతా కూడా ఎన్టీఆర్ మీదే నడుస్తుంది. మిగతా ఏవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే అంశాలు తప్ప కామన్ ఆడియన్స్ కు పెద్దగా రుచించదు.
నటీనటుల పనితీరు :
ఎన్టీఆర్ తన ఎనర్జీతో అదరగొట్టాడు. డ్యుయల్ రోల్ లో తన యాక్టింగ్ అదుర్స్. యాక్షన్ సీన్స్ లో పీక్స్ అనిపించాడు. జాన్వి కపూర్ కొద్దిపాటి స్క్రీన్ స్పేస్ తోనే సరిపెట్టుకుంది. ఆమెకు అసలు సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. సైఫ్ అలీ ఖాన్ విలనిజం జస్ట్ ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్, మురళి శర్మ పాత్రలు పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
అనిరుద్ మ్యూజిక్ ఇరగ్గొట్టాడు. బిజిఎం కూడా అదుర్స్. కెమెరా మెన్ రత్నవేలు కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యాడు. సాబు సిరిల్ సెట్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ గా కొరటాల శివ 100 శాతం బెస్ట్ వర్క్ ఇవ్వలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్ :
ఎన్ టీ ఆర్
మ్యూజిక్
కొన్ని హై మూమెంట్స్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ డ్రాగ్ సీన్స్
ఊహించే కథనం
అక్కడక్కడ వీక్ అనిపించడం
బాటం లైన్ : దేవర కేవలం ఫ్యాన్స్ కోసమే..!
రేటింగ్ : 2.5/5