Kalki 2898 AD Movie Review : బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో నడవకపోయినా.. హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సింహం ఒక అడుగు వెనక్కి వేసినట్టు.. ఫ్లాప్ లతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ బ్యాక్ బౌన్స్ అవుతున్నారు. గతేడాది ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ఇపుడు ‘కల్కి’ మూవీతో అది కంటిన్యూ చేయనున్నాడు. ఈ సినిమా మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న విడుదల కాబోతుంది.
మహా భారత కాలం నుంచి 2898 AD వరకు 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సినిమా ప్రారంభమైన అర గంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అప్పటి నుంచి క్లైమాక్స్ రెబల్ స్టార్ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు. మరోవైపు అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ .. సినిమా ప్రారంభమైన గంట తర్వాత ఎంట్రీ ఇస్తాడట. ఆయన పై చిత్రీ కరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనున్నాయి. అమితాబ్, ప్రభాస్ మధ్య పోరాట సన్నివేశాలు సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలుస్తుంది. దీపికా పదుకొణే పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం కానుంది.
నటీనటులు: ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్ ,కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్
దర్శకుడు: నాగ్ అశ్విన్
నిర్మాతలు: అశ్వినీదత్
సంగీతం: సంతోష్ నారాయణ్
విడదల తేది: జూన్ 27, 2024
ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులకు ఆశ్యర్యానికి లోనవుతారట. ఇక కల్కి మూవీలో కమల్ హాసన్ కేవలం నాలుగైదు సన్నివేశాల్లో కనిపించనుండగా, ఆయన పాత్ర మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. కమల్ హాసన్ పాత్రకు రెండో పార్ట్ లో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా మూడు ప్రపంచాల మధ్య కొత్త ఊహా జనిత కథనానికి మన భారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ తో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాలో 9 రకాల యుద్దాలకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయట. కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి.. ‘కల్కి..’ ఎలా వస్తాడు? అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందట. సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూంజ్ బంప్స్ తెప్పిస్తాయట. ఈ సినిమా రన్ టైమ్ 180 నిమిషాల 56 సెకండ్స్ ఉంది…
హిందూపురాణం మహాభారతంలోని కొన్ని అంశాలని కలియుగానికి కనెక్ట్ చేస్తూ తన విజన్ తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, కథ అనేది మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్ధం నుండి మొదలు అవుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడు నుండి శాపం పొందిన అశ్వత్థామ కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే సుమతి అనే మహిళ కడుపున కల్కి పుట్టబోతున్నాడని ఆయనకి తెలుస్తుంది.వెంటనే ఆమెకి సంరక్షుకుడిగా మారతాడు. అయితే కాంప్లెక్స్‌లో వెళ్లడానికి 1 మిలియన్ యూనిట్ల కోసం భైరవ వెతుకుతుండగా, సుమతిని పట్టుకొస్తే ఆ యూనిట్స్ దక్కుతాయని తెలుసుకుంటాడు. అప్పుడు భైరవ.. అశ్వథ్థామని ఎదురించి సుమతిని పట్టుకొచ్చాడా.. సుప్రీమ్ యష్కిన్ ఎవరు? కురుక్షేత్ర యుద్ధంతో కలి యుగం అంతం ఎలా ముడిపడింది అనేది తెలియాలంటే కల్కి చిత్రం చూడాల్సిందే.
మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందించారు. సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్‌గా కమల్ హాసన్, భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పదుకొణె, రోక్సీగా దిశా పటానీ నటించారు. ఇక భైరవ దోస్త్‌గా బుజ్జి అనే స్పెషల్ రొబోటిక్ కారును రూ.7 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ వినియోగించారు. ప్రభాస్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో నటించి మెప్పించారు. పెద్దగా కష్టపడకుండా ప్రభాస్ నటించిన తొలి సినిమా ఇదే అని చెప్పాలి. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా ప్రతి ఒక్కరు బాగా పని చేశారు. నాగ్ అశ్విన్ తన రచనతో పాటు దర్శకత్వంతో అదరగొట్టాడు. విజన్ ని సరిగ్గా ప్రొజెక్ట్ చేశారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది ..సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలలో కెమెరా పనితనం అదరహో అని చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నాగ్ అశ్విన్
ప్రభాస్, కమల్, దీపికా, అమితాబ్
కురుక్షేత్రం ఎపిసోడ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ లో మొదటి 40 నిమిషాలు
దీపికా పదుకొణే డబ్బింగ్
కొన్ని ఎమోషన్స్ బలంగా చూపించకపోవడం
చివరిగా.. కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూనిక్ స్టోరీ థీమ్ తో, భారీ తారాగణంతో సినిమాని చాలా అందంగా మలిచాడు నాగ్ అశ్విన్. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చాలా ఇష్టపడతారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించిన సినిమా మాత్రం ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రంగా ఈ
మూవీ తప్పక ఉంటుంది.
రేటింగ్ 3.75/ 5
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.