KGF 2 Movie Review : కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బాక్సాఫీస్ బద్దలేనట..!
KGF 2 Movie Review : కన్నడ సినిమా కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ఒక్క సినిమాతో హీరోగా యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ వచ్చింది. త్వరలోనే ఈయన కేజీఎఫ్ 2 మూవీతో పలకరించనున్నారు. కెజియఫ్ 2కు ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే రైట్స్ కోసం చెల్లించారంటే రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అంచనాలు పెంచాడు..
ఇప్పటి వరకూ కేరళ, ముంబైలలో ప్రెస్ మీట్లలో పాల్గొన్న రాఖీ భాయ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు రూట్ మ్యాప్ రివీల్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 10న సాయంత్రం 6.30 గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు . ఇక ఏప్రిల్ 11న ఉద్యమ 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. అదే రోజున ఉదయం 10.30 గంటలకు సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. 11.30కి వైజాగ్ లో ప్రెస్ మీట్ ఉంటుంది. ఏప్రిల్ 11నే సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. ఇలా రెండ్రోజుల్లోనే ఏమాత్రం రెస్ట్ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు రాఖీ భాయ్.
మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీర్ సెన్సార్ బోర్డ్ అభ్యర్థి ఉమైర్ సంధు.. ఈ మధ్య సౌత్ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. తాను సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు రివ్యూలను కూడా ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇప్పటివరకు ఉమైర్ ఇచ్చిన రివ్యూలు దాదాపు కరెక్ట్ అయ్యాయి. తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2కు కూడా ఫస్ట్ రివ్యూను ఇచ్చేశాడు ఉమైర్ సంధు. కేజీఎఫ్ 2 మొత్తంగా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో స్టైల్, సబ్జెక్ట్ రెండిటితో పాటు ఆశ్చర్యపరిచే యాక్షన్, అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి.’ ‘ముఖ్యంగా యశ్ ఈ సినిమాకు ట్రంప్ కార్డ్‌లాగా నిలిచాడు. యశ్ చరిష్మా వల్లే సినిమా ఓపెనింగ్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి కానీ సినిమా ఎక్కువకాలం నడవాలంటే మాత్రం కంటెంటే ముఖ్యం. పైగా ఎక్కువరోజులు నడిచే సత్తా కూడా సినిమాలో ఉంది. కచ్చితంగా ఇదొక బ్లాక్ బస్టర్. అంతే కాకుండా యశ్ బెస్ట్ సినిమా.’ అని రివ్యూను ఇచ్చాడు ఉమైర్ సంధు.