
Korean Kanakaraju Movie First Review : వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ - Live Updates ..!
Korean Kanakaraju Movie First Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొణిదెల హీరోగా, యువ నటి రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందే మంచి ఆసక్తిని రేకెత్తించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దక్షా నగార్కర్, కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను సత్య జీ చేపట్టగా, ఏ. పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్యామ్ కాసర్ల పాటలకు సాహిత్యం అందించగా, యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందే పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌లను వీక్షించిన నెటిజన్లు, సినీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వస్తున్న తొలి స్పందనలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి…
Korean Kanakaraju Movie First Review : వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ – Live Updates ..!
ఒక నెటిజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలం. వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. వరుణ్ తేజ్ కట్‌అవుట్‌కు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి” అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మరో ప్రేక్షకుడు స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. కథ సాధారణంగానే ఉన్నా దర్శకుడు మేర్లపాక గాంధీ దాన్ని చాలా ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. అతను వన్ మ్యాన్ షోలా నవ్వులు పంచాడు” అంటూ ట్వీట్ చేశాడు.ఇంకో సినీ అభిమాని తన స్పందనలో, “ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టినట్లు అనిపించదు. కథ సహజంగా ముందుకు సాగుతుండగానే కామెడీ పుడుతోంది. ముఖ్యంగా కనకరాజు-కిష్టప్ప స్నేహం చుట్టూ వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తున్నాయి. వరుణ్ తేజ్, సత్య మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా కనిపించింది. ఇద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది” అని పేర్కొన్నాడు.
మరో సినీ అభిమాని ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటిగా అనిపిస్తోంది. విజువల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ బ్లాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా డల్ కాకుండా మంచి ఎనర్జీతో సాగింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని రాసుకొచ్చాడు.
మరో ప్రేక్షకుడు తన ట్వీట్‌లో, “ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్‌గా సాగింది. వరుణ్ తేజ్‌కు ఇది బలమైన కంబ్యాక్ మూవీ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. సత్య తన కామెడీతో మరోసారి ఆకట్టుకున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ రైటింగ్ బాగా వర్కౌట్ అయింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇచ్చింది” అని పేర్కొన్నాడు.ఇప్పటివరకు సోషల్ మీడియాలో కనిపిస్తున్న తొలి స్పందనలను పరిశీలిస్తే, ఫస్ట్ హాఫ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్-సత్య కామెడీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ఎపిసోడ్, యాక్షన్ సన్నివేశాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇవి ప్రీమియర్ షో చూసిన కొందరు ప్రేక్షకులు, నెటిజన్ల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. సినిమా విడుదల అనంతరం పూర్తి స్థాయి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కొరియన్ కనకరాజు , కొరియన్ కనకరాజు రివ్యూ, వరుణ్ తేజ్ ,కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ ,తెలుగు సినిమా రివ్యూ , కొరియన్ కనకరాజు సినిమా సమీక్ష
సీక్వెల్‌కు లీడ్ ఇస్తూ సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం ది తెలుగు న్యూస్ ఫాలో అవ్వండి.
కథలో ఓ కీలక ట్విస్ట్ రివీల్ అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, వరుణ్ తేజ్, రితిక లపై ఓ ముఖ్యమైన సీన్ వస్తుంది.
తమ సమస్యకు సంబంధించి లీడ్ పెయిర్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్, అతని గ్యాంగ్ ఓ సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య నుంచి బయట పడేందుకు వారు ప్రయత్నిస్తుంటారు.
కొరియన్ ఆత్మకు సంబంధించిన నేపథ్యం రివీల్ అవుతుంది. ఇప్పుడు కథలోకి బుల్లిరాజు ఎంట్రీ ఇస్తాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. వరుణ్ తేజ్, సత్య కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక ఇంటెన్స్ ఫైట్ మరియు ఒక కీలక ట్విస్ట్‌తో సినిమా సగానికి చేరుకుంది.
హీరోను ఆత్మ ఆవహించిందనే విషయం సత్య తెలుసుకుంటాడు. దీనికి పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తుంటాడు
కథలో కీలకమైన సన్నివేశం వస్తుంది. వరుణ్ తేజ్‌ను ఓ కొరియన్ ఆత్మ ఆవహిస్తుంది. ఈ ఎపిసోడ్ చాలా చక్కగా ప్రెజంట్ చేశారు.
వరుణ్ తేజ్, సత్య, ఒక కొరియన్ నటుడిపై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
హీరోయిన్ రితిక నాయక్ పరిచయం అవుతుంది. కియా ప్లాంట్‌లో ఆమె ఉద్యోగం చేస్తుంటుంది.
కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దక్ష నాగర్కర్‌తో ‘రాస గుమ్మడి’ సాంగ్ వస్తుంది.
కథ కొరియాలో ప్రారంభమై వెంటనే అనంతపూర్‌లోని కియా ప్లాంట్‌కు షిఫ్ట్ అవుతుంది.
హాయ్.. 2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Vijayasai Reddy Vs Subba Reddy వైసీపీ మాజీ ఎంపీ, మాజీ ముఖ్య నేత వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా…
Hanuman Nagar Colony : ఉప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహం, ఐక్యత…
Vizag : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల…
Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం…
Women's : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఉద్యోగం లేదా సాధారణ…
Peanuts : వేరుశనగను చాలామంది సాధారణ స్నాక్‌గా చూస్తారు. కానీ ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-E, మెగ్నీషియం,…
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో…
Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? సీఎం చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న…
Vishwanath And Sons Movie Review : కుటుంబ కథలు, భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిసిన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ…
Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749:…
This website uses cookies.