Krishna Vrinda Vihari Movie Review : ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి వరుస సినిమా హిట్స్‌తో కెరీర్ మొదట్లోనే మంచి పేరు అందుకున్న నాగ శౌర్య ఆ తర్వాత ఛలో సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ నాగశౌర్యకు ఒక్కటంటే ఒక్క హిట్ రాలేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
Krishna Vrinda Vihari Movie Review కథ : నాగ శౌర్య సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‌గా జాయిన్ అవుతాడు.ఆ కంపెనీలో పని చేసే మేనేజర్ షెర్లీతో నాగ శౌర్యకి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఇక ఈ ఇద్దరు కలిసి వర్క్‌లో వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎంతో సమర్ధవంతంగా హ్యాండిల్ చేయడంతో అక్కడ కాస్త ఫన్ జనరేట్ అవుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా ఎలా మారింది, కృష్ణగా నటించిన నాగ శౌర్య పరిస్థితులని ఎలా హ్యాండిల్ చేశాడన్నదే మిగతా కథ
పనితీరు : లీడ్ పెయిర్ నాగశౌర్య, హీరోయిన్ షిర్లే జంట చక్కని వినోదాన్ని పంచారు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశాయి. కుటుంబ సన్నివేశాలు, కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక సంగీతం కూడా పర్వాలేదు. దర్శకుడు కథకి కొంచెం పదును పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలు కత్తిరిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథను ములుపు తిప్పడం బాగుంది. నాగశౌర్య ఎప్పటిలాగే కూల్ వైబ్‌తో ఆకట్టుకోవడం, హీరోయిన్ షిర్లీ సెటియా తెరపై చాలా అందంగా కనిపించడం సినిమాకి ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్ : నటీనటులు
ఫ్యామిలీ సన్నివేశాలు
కామెడీ
మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ ఫ్లాట్ స్టోరీ
ఫైనల్‌గా కృష్ణ వ్రిందా విహారి చిత్రం ఆడియన్స్‌ని అలరిస్తుంది కాని అంత గొప్ప సినిమా కాదనే చెప్పాలి. సినిమా కథ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్‌పైనే నడుస్తుండగా, అక్కడక్క వచ్చే కామెడీ సీన్స్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. అనీష్ కృష్ణ టేకింగ్‌తో తన మార్క్ చూపించాడు. కథ ఇంకాస్త బలంగా ఉంటే మూవీ మంచి హిట్ అయి ఉండేది.
రేటింగ్ 2/ 5
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.