Krishna Vrinda Vihari Movie Review : కృష్ణ వ్రిందా విహారి మూవీ రివ్యూ & రేటింగ్…!

Authored By Sam C | The Telugu News | Published on: September 23, 2022, 11:00 am

Krishna Vrinda Vihari Movie Review : ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి వరుస సినిమా హిట్స్‌తో కెరీర్ మొద‌ట్లోనే మంచి పేరు అందుకున్న నాగ శౌర్య ఆ త‌ర్వాత ఛ‌లో సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ నాగ‌శౌర్య‌కు ఒక్క‌టంటే ఒక్క హిట్ రాలేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

Krishna Vrinda Vihari Movie Review క‌థ : నాగ శౌర్య సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్నిక‌ల్ ట్రైన‌ర్‌గా జాయిన్ అవుతాడు.ఆ కంపెనీలో ప‌ని చేసే మేనేజ‌ర్ షెర్లీతో నాగ శౌర్య‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారుతుంది. ఇక ఈ ఇద్ద‌రు క‌లిసి వ‌ర్క్‌లో వ‌చ్చే కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా హ్యాండిల్ చేయ‌డంతో అక్క‌డ కాస్త ఫ‌న్ జ‌న‌రేట్ అవుతుంది. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా ఎలా మారింది, కృష్ణ‌గా న‌టించిన నాగ శౌర్య ప‌రిస్థితుల‌ని ఎలా హ్యాండిల్ చేశాడ‌న్న‌దే మిగ‌తా క‌థ‌

Krishna Vrinda Vihari Movie Review and Rating in Telugu

Krishna Vrinda Vihari Movie Review and Rating in Telugu

ప‌నితీరు : లీడ్‌ పెయిర్‌ నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే జంట చ‌క్క‌ని వినోదాన్ని పంచారు. ఇక స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశాయి. కుటుంబ స‌న్నివేశాలు, కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక సంగీతం కూడా ప‌ర్వాలేదు. ద‌ర్శ‌కుడు కథ‌కి కొంచెం ప‌దును పెడితే బాగుండేది. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్‌లో కొన్ని స‌న్నివేశాలు క‌త్తిరిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథను ములుపు తిప్పడం బాగుంది. నాగశౌర్య ఎప్పటిలాగే కూల్ వైబ్‌తో ఆకట్టుకోవ‌డం, హీరోయిన్ షిర్లీ సెటియా తెరపై చాలా అందంగా కనిపించ‌డం సినిమాకి ప్ల‌స్ అయింది.

ప్ల‌స్ పాయింట్స్ : న‌టీన‌టులు
ఫ్యామిలీ స‌న్నివేశాలు
కామెడీ

మైన‌స్ పాయింట్స్ : సెకండాఫ్ ఫ్లాట్ స్టోరీ

ఫైన‌ల్‌గా కృష్ణ వ్రిందా విహారి చిత్రం ఆడియ‌న్స్‌ని అల‌రిస్తుంది కాని అంత గొప్ప సినిమా కాద‌నే చెప్పాలి. సినిమా కథ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్‌పైనే నడుస్తుండ‌గా, అక్క‌డ‌క్క వ‌చ్చే కామెడీ సీన్స్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. అనీష్‌ కృష్ణ టేకింగ్‌తో తన మార్క్ చూపించాడు. క‌థ ఇంకాస్త బ‌లంగా ఉంటే మూవీ మంచి హిట్ అయి ఉండేది.

రేటింగ్ 2/ 5

Sam C

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp