lawrence jigarthanda double x movie review and rating in telugu
Lawrence Jigarthanda 2 Movie Review : జిగర్తాండా డబుల్ ఎక్స్ అనే మూవీ గురించి మాట్లాడుకోవడానికి ముందు మనం కార్తీక్ సుబ్బరాజు గురించి మాట్లాడుకోవాలి. ఇంతకీ ఎవరు ఈయన అంటారా? ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఈయనే. కార్తీక్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవాలి. ఒక పిజ్జా, ఒక జిగర్తాండా సినిమాలు అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులోనే జిగర్తాండా పార్ట్ వన్ సినిమాను గద్దలకొండ గణేష్ పేరుతో హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా జిగర్తాండా సినిమాకు సీక్వెల్ గా జిగర్తాండా డబుల్ ఎక్స్ పేరుతో కార్తీక్ సుబ్బరాజు మరో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య హీరోలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళం, తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా వేశారు. ఈ సినిమాకు చివరి 40 నిమిషాలు హైలెట్ అంటూ ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ ట్వీట్ చేయడం విశేషం. హీరో ధనుష్ మెచ్చుకున్నాడు అంటే ఇక ఈ సినిమా సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. ఇక.. ఈ సినిమాలో నటించిన రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఇరగదీశారనే చెప్పుకోవాలి. పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా డబుల్ ఎక్స్ అయిందా? జిగర్తాండాకు సీక్వెల్ గా ఈ సినిమాను ఎందుకు తీశారు. ఈ సినిమా కథ ఏంటి? అసలు ఈ సినిమాలో ఇద్దరు హీరోలను ఎందుకు పెట్టారు.. అనేది తెలియాలంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
ఎస్సై కావాలని అనుకుంటాడు. కానీ.. తనకు ఉన్న భయంతో ఓ హత్యా నేరంలో ఇరుక్కుంటాడు. జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు ఎస్‌జే సూర్య(కృప). ఇక.. అలియాస్ సీజర్(రాఘవ లారెన్స్).. కర్నూలు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అక్కడి రాజకీయ నాయకుల అండదండలు అతడికి ఉంటాయి. ఓ హీరో వల్ల అసలు గొడవ మొదలు అవుతుంది. రాజకీయాలు, సినిమాలు రెండు రంగాల్లో రాణించిన హీరో జయకృష్ణ. అయితే.. సినిమా థియేటర్ల విషయమై మరో నేతతో గొడవ పడతాడు. దీంతో ఆ నేతకు చెందిన కీలక రౌడీలను చంపేందుకు జయకృష్ణ.. తన తమ్ముడిని రంగంలోకి దించుతాడు. అందులో నలుగురిని సెలెక్ట్ చేస్తారు. ఆ నలుగురిలో కృప పేరు కూడా వస్తుంది. సీజర్ ను చంపాలని కృపకు చెబుతారు. దీంతో సీజర్ దగ్గరికి వెళ్తాడు కృప. అసలు కృప ఎందుకు వచ్చాడు. సీజర్ ను చంపడానికే అనే విషయం కృపకు తెలిసిందా? అసలు ఏం జరిగింది.. చివరకు సీజర్ సినిమా తీయాలని ఎందుకు అనుకుంటాడు. దానికి కృప దర్శకత్వం వహిస్తాడా? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగితా కథ.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా సూపర్ హిట్ అని ధనుష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాఘవ లారెన్స్ నటన. ఆయన జీవించేశాడు. స్క్రీన్ ప్లే కూడా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక.. ఈ సినిమాలో చివరి 40 నిమిషాలు పిచ్చెక్కిస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని అంటున్నారు. లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్ చాలా భారీగా ఉంది. తన క్యారెక్టర్ ఎంట్రీ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ కూడా బాగుంటుంది. ఫస్టాఫ్ అదిరిపోతుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో సీజర్ అడవికి వెళ్తాడు. అక్కడ విలన్ తో ఫైట్ చేయడం బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ల సమస్యల గురించి తెలుసుకోవడం ఇవన్నీ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ప్లస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
లాస్ట్ 40 నిమిషాలు
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
దారి తప్పిన కథనం
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.