Categories: NewsReviews

Nishabdha Prema Movie Review : ప్రేమకు మరో కొత్త నిర్వచనం.. ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nishabdha Prema Movie Review : ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని భాషలలోని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టారు. అందునా థ్రిల్లింగ్ అంశాలతో, చివరి వరకు ట్విస్ట్‌లను మెయింటైన్ చేయగలిగిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి సినిమాలే ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురాగలుగుతున్నాయి. ఇప్పుడలాంటి చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ‘నిశ్శబ్ద ప్రేమ’ చిత్రయూనిట్ తెలిపింది. ఆల్రెడీ తమిళ్‌లో విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా, మే 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇందులో ఉన్న విషయం ఏమిటి? ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చిందా ? తెలుగు ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఇందులో ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Nishabdha Prema Movie Review : ప్రేమకు మరో కొత్త నిర్వచనం.. ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nishabdha Prema Movie Review ‘నిశ్శబ్ద ప్రేమ’ స్టోరి

ఓపెనింగ్ సీన్ సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను Priyanka Thimmesh వాళ్లింట్లోనే ఓ ముసుగు మనిషి వెంబడిస్తూ చంపే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె ఆ ముసుగు మనిషిని తప్పించుకుని వీధిలోకి వచ్చి పరుగెడుతుండగా ఓ వ్యక్తి ఆమెకు యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ అయి రోడ్డుపై పడి ఉన్న సంధ్యను రఘు అనే వ్యక్తి హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్‌మెంట్ ఇప్పించగా, తలకు తగిలిన దెబ్బతో ఆమె గతం మరిచిపోతుంది. తనని హాస్పిటల్‌లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఆ సమయంలో కనిపించిన పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. ఈలోపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలెట్టిన కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు యునానిమస్ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా Niharika (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ.

Nishabdha Prema Movie Review నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు

యునానిమస్ కిల్లర్ విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ Sriram నటన ఈ సినిమాకు హైలెట్. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రని ఆయన ఇందులో పోషించారు. ఇందులో మరో కోణం ఆయన పాత్రకి ఉంది. ఆ పాత్రలోనూ శ్రీరామ్ తన అనుభవాన్ని కనబరిచారు. ఇలాంటి పాత్రలు ఆయనకి కొత్తేం కాదు. తన పాత్రలోని వైవిధ్యం, ఆ వైవిధ్యానికి తగినట్లుగా శ్రీరామ్ అమరిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే ఈ సినిమా అంతా నడుస్తుంది. గృహిణిగా చక్కని అభినయం ఆమె ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్రో కనిపించేది కాసేపే అయినా కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రఘు పాత్రలో నటించిన వియాన్, కండలు తిరిగిన శరీరంతో కనిపించారు. అమాయకుడిగానూ, అలాగే కథలో కీలకమైన పాత్రలోనూ వియాన్ మెప్పించారు. ఇంకా హరీశ్ పెరడితో పాటు ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రల పరిధిమేర నటించి సినిమాకు తమ సహకారం అందించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మరీ ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జుబిన్.. ఓ స్టార్ హీరో సినిమా చూస్తున్న ఫీల్‌ని తెప్పించారు. ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా మూడ్‌కి అనుగుణంగా ఉంది. ఎడిటింగ్ పరంగా కూడా ఎటువంటి వంకలు లేవు. మధ్యలో ఒకటి రెండు సీన్లు కాస్త స్లో అనిపించినా, కథలోని థ్రిల్లింగ్ అంశాలు దానిని డామినేట్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రైయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ని కలిగించారు. దర్శకుడు తను రాసుకున్న కథని, సైడ్ ట్రాక్‌కి వెళ్లకుండా పర్ఫెక్ట్‌గా చిత్రీకరించి, తన ప్రతిభను చాటాడు.

మూవీ పేరు: ‘నిశ్శబ్ద ప్రేమ’
విడుదల తేదీ: 23 మే, 2025
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులు
డీవోపీ: యువరాజ్.ఎం
ఎడిటర్: మదన్.జి
సంగీతం: జుబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పరిటాల రాంబాబు
బ్యానర్: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
నిర్మాత: కార్తికేయన్. ఎస్
దర్శకత్వం: రాజ్ దేవ్

Nishabdha Prema Movie Review విశ్లేషణ

సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం టైమ్ తీసుకోకుండా, డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమాలో రెండే రెండు పాటలు ఉన్నాయి. ఒక థ్రిల్లర్ చిత్రానికి ఐదారు పాటలు పెట్టి ఫ్లో చెడగొట్టకుండా, ఎక్కడ పాటలు రావాలో అక్కడే సెట్ చేశారు. దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? అనేది ఓ క్లారిటీ వస్తుంది కానీ, అతను ఎలా బయటకు వస్తాడు? అతన్ని ఎవరు కనిపెడతారు? అనేది ఉత్కంఠగా సాగుతుంది. చివరకు ఇచ్చిన ముగింపు కూడా కన్వెన్సింగ్‌గానే ఉంది. శ్రీరామ్ డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌‌గా అయితే, ఎక్కడా బోర్ కొట్టకుండా, ట్విస్ట్‌లతో పాటు వాటికి వివరణ ఇచ్చిన విధానం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ని ఇస్తుంది. సమయం ఉంటే, ఓసారి థియేటర్‌కి వెళ్లి చూడొచ్చు.

ట్యాగ్‌లైన్: ప్రేమకు మరో కొత్త నిర్వచనం
రేటింగ్: 3/5

Recent Posts

Mallapur : నర్సుతో డెలివరీ చేయించిన డాక్టర్… శిశువు మృతి.. డాక్టర్, స్టాఫ్ నర్సులను సస్పెండ్ కు డిమాండ్‌..!

Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…

1 hour ago

Niharika Konidela : కేక పెట్టించే అందాల‌తో మెగా డాట‌ర్ ర‌చ్చ మాములుగా లేదుగా.. పిక్స్ వైర‌ల్‌

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అందం, అభినయంతో ఈ బ్యూటీ…

2 hours ago

Sampurna Web Series : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. ఓటిటిలో దూసుకెళ్తున్న సిరీస్..!

Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT  విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను…

3 hours ago

Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. వాటిలో ఇటీవ‌ల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…

4 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లో బోనాల చెక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి

Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…

5 hours ago

TDP : టీడీపీ అధిష్టానం మోసం చేసిందంటూ నేత ఇమామ్ భాష ఆత్మహత్యాయత్నం..!

TDP : నెల్లూరు జిల్లా Nellore  విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…

5 hours ago

Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…

6 hours ago

Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్య‌క్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…

7 hours ago