నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, శ్రీలీల, సునీల్, అనసూయ, రావు రమేష్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : మిరోస్లో కుబా బ్రొజెక్
దర్శకత్వం : సుకుమార్
నిర్మాతలు : నవీన్ యెర్నెని, వై. రవి శంకర్.
పుష్ప 1 తో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2 తో వైల్డ్ ఫైర్ గా రాబోతున్నాడు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగినట్టుగా ఉందా.. సినిమాపై ఇన్నేళ్ల ఎదురుచూపులు చూసిన ఫ్యాన్స్ కు సినిమా అంచనాలకు తగినట్టు ఉందా లేదా అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
సినిమాపై నేషనల్ లెవెల్ లో ఉన్న బజ్ తెలిసిందే. సుకుమార్ సినిమాను అదరగొట్టే రేంజ్ లో తెరకెక్కించారని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్ధమవుతుంది. రష్మిక అందాలు, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా రేంజ్ పెంచింది. అల్లు అర్జున్ మరోసారి తన మాస్ వీరంగం ఆడేస్తాడని తెలుస్తుంది. నేషనల్ వైడ్ గా సూపర్ బజ్ ఏర్పరచుకున్న పుష్ప 2 కి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో అవుతున్నాయి. సినిమాను తప్పకుండా నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించి ఉంటాడని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.
పుష్ప 2 బజ్ పరంగా చూస్తే 1000 కోట్లు పక్కా అన్నట్టుగా ఉంది. అంతేకాదు సినిమా గురించి నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
పుష్ప 1 హిట్ తో పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2 కి సూపర్ బజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు తగ్గకుండా సినిమా ఉండాలని సుకుమార్ పుష్ప 2 తెరకెక్కించాడు. పార్ట్ 1 సూపర్ హిట్ కాగా పార్ట్ 2 ని దానికి మించి ఉండేలా సుకుమార్ 3 ఏళ్లు టైం తీసుకుని తెరకెక్కించాడు పుష్ప 2. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
ఎస్పీ భన్వర్ సింగ్ తో ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి అతనితో వైరం పెట్టుకున్న పుష్ప రాజ్ బిజినెస్ లో ఎదిగి తన వ్యాపారాన్ని విస్తరిస్తాడు. పుష్ప 2 కథ జపాన్ లో మొదలవుతుంది. తన శత్రువ్లంతా కూడా కలిసి పుష్ప రాజ్ ని మట్టు పెట్టాలని చూస్తాడు. వారికి భన్వర్ సింగ్ హెల్ప్ చేస్తాడు. ఈ రణరంగంలో ఎవరు గెలిచారు. పుష్ప రాజ్ శ్రీవల్లి పెళ్లి బంధం ఎలా సాగింది..? ఫైనల్ గా పుష్ప రాజ్ ఏమయ్యాడు అన్నది పుష్ప 2 ది రూల్ కథ.
పుష్ప 1 మొదలైన చోటే పార్ట్ 2 కథ మొదలవుతుంది. పార్ట్ 1 లో పుష్ప రాజ్ యాటిట్యూడ్ ని కొన్ని చోట్ల మాత్రమే వాడిన సుకుమార్ పుష్ప 2 లో నెక్స్ట్ లెవెల్ లో వాడేశాడు. సినిమా కు ప్రధాన హైలెట్ గా పుష్ప రాజ్ పాత్ర నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎలివేషన్ చేసి ఇంటర్వల్ ట్విస్ట్ ఇవ్వగా సెకండ్ హాఫ్ అంతా మాస్ రాంపేజ్ తో రఫ్ఫాడించేస్తారు.
సినిమా అంతా కూడా ఒకే రేంజ్ లో హై ఎమోషన్, యాక్షన్ లో సాగుతుంది. థియేతర్ లోకి వెళ్లి సినిమా మొదలవడమే ఆలస్యం కథలో లీనమయ్యేలా సుకుమార్ ప్లాన్ చేశాడు. ఇక కథ కథనాల వేగం అందులో పుష్ప రాజ్ యాటిట్యూడ్ అంతా కూడా ఆడియన్స్ కు పైసా వసూల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.
యాక్షన్ బ్లాగ్స్ అన్ని కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ జాతర సీన్స్ అయితే ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. సినిమాను పూర్తిగా ఫ్యాన్స్ ఫీస్ట్ గా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు పుష్ప రాజ్ యాటిట్యూడ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ ట్రా మసాలా ధం బిర్యాని రేంజ్ లో ఉంటాయి.
మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్ప 2 లో ఉన్నాయి. సాంగ్స్ ప్లేస్ మెంట్.. హీరోయిన్స్ గ్లామర్ కూడా సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఫైనల్ గా పుష్ప 2 పక్కా పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు.
పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మరోసారి విజృంభించాడు. పూనకాలు తెప్పించే యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అనేది పర్ఫెక్ట్ అనిపించేలా పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఉంది. శ్రీవల్లి అందాలు స్పెషల్ ఎట్రాక్షన్. ఐతే సినిమాలో రష్మిక పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. సినిమాలో ఒక లెంగ్తీ డైలాగ్ రష్మిక ఫ్యాన్స్ ని విజిల్స్ వేసేలా చేస్తుంది. శ్రీలీల కిసిక్ సాంగ్ అదుర్స్.. సునీల్, అనసూయ, రావు రమేష్, ఫాహద్ ఫాజిల్ ఇలా అందరు బాగా చేశారు.
టెక్నిక టీం విషయానికి వస్తే.. రుబా సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సినిమాలో టెక్నికల్ టీం లో కెమెరా మెన్ కి ఎక్కువ మార్కులు ఇచ్చేయొచ్చు. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు తగినట్టుగా ఉంది. 2 సాంగ్స్ అదుర్స్ అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మైత్రి వారు ది బెస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇచ్చారు. సుకుమార్ మరోసారి అన్ని విధాలుగా సక్సెస్ అయ్యాడు. పుష్ప 2 సుక్కు మార్క్ మూవీ అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
సుకుమార్ టేకింగ్
అల్లు అర్జున్ యాక్టింగ్
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు..
కాస్త రన్ టైం మాత్రమే
బాటం లైన్ :
పుష్ప 2 .. సుకుమార్ అల్లు అర్జున్ ఎక్స్ ట్రా ధమ్ మసాలా బిర్యాని..!
రేటింగ్ : 3.25/5
పూర్తి రివ్యూ మా వెబ్‌సైట్ thtelugunews.com ద్వారా తెలుసుకోండి . Pushpa 2 The Rule Movie Review and rating in Telugu , Allu Arjun, Pushpa 2 Review, Sukumar, Rashmika Mandanna, Pushpa 2 Review & Rating
9 Planests : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఖగోళంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి.…
ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో జుట్టును కత్తిరించుకోవడం సహజం. కానీ మంగళవారం రోజు మాత్రం ఎవరు జుట్టు కత్తిరించరు.…
Maharashtra : మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందు, పాలక కూటమి ఇంకా అధికారంలో ఉన్న…
Pushpa 2 The Rule Live Updates : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబోలో…
Pushpa 2 The Rule Movie Review : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ కాంబినేషన్ లో భారీ…
Ganga Water : హరిద్వార్లోని గంగా నది నీరు 'బి' కేటగిరీలో ఉన్నట్లు గుర్తించబడిందని, ఇది త్రాగడానికి సురక్షితం కాదని,…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi ఆరు పదుల వయస్సులో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. చిరంజీవిని ఇప్పుడు…
Pushpa 2 The Rule : చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ Allu Arjun ఆనతి కాలంలోనే…
This website uses cookies.