Pushpa Movie Review : తగ్గేదేలే అంటున్న పుష్ప.. ఓవర్‌సీస్ లోనూ ప్రీమియర్ కలెక్షన్స్‌లో రికార్డు..

 Authored By mallesh | The Telugu News | Updated on :17 December 2021,1:00 pm

Pushpa Movie Review: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ పుష్ప. ఈ మూవీ ఈ రోజు (డిసెంబర్ 17న) థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీపై మొదటి నుంచి బాగా హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే.. షూటింగ్ సమయంలోనూ ఎప్పటికప్పడు మూవీ యూనిట్ అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది. దీనికి తోడు ఎప్పటి కప్పుడు హీరో, హీరోయిన్, అనసూయ, సునీల్ వంటి వారి పోస్టర్ లను రిలీజ్ చేసింది. దీంతో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయ. గతంలో ఎప్పుడు చూడని విధంగా సునీల్‌ను మీ మూవీలో మనం చూశాం.

Pushpa Movie Review : టాప్ రెండు మూవీస్‌లో పుష్ప ఒకటి..

pushpa movie record in over premier collections

pushpa movie record in over premier collections

నెగెటివ్ షేర్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ లో ఆయన నటన అద్భుతం.ఇక ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ షోస్ వేశారు. రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో ఈ సంవత్సరంలో ఏ మూవీకి లేనంత డిమాండ్ పుష్పకు దక్కింది. ఈ మూవీకి విదేశాల్లో స్టైలిష్ స్టార్ ఫ్యా్న్స్ భారీగా రెస్పాండ్ అయ్యారు. థియేటర్లకు పరుగులు పెట్టారు. ఈ మూవీ ప్రీమియర్స్ ద్వారా సుమారు 406 వేల డాటర్స్ కలెక్ట్ చేసింది పుష్ప.

2021లో రిలీజ్ అయిన మూవీస్‌లో ఈ రేంజ్ లో కలెక్సన్స్ సాధించిన మొదటి రెండు మూవీస్ లో పుష్ప చోటు దక్కించుకుంది. ఇక ఈ మూవీని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయాలని భావించారు డైరెక్టర్ సుకుమార్. ఇందులో పార్ట్ వన్ ఈ రోజు రిలీజ్ కాగా.. పార్ట్ రెండు ను త్వరలోనే తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రంగస్థలం తో సూపర్ హిట్ కొట్టిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. పుష్పతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన యాక్ట్ చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి