Skanda Movie Review : రామ్ పోతినేని ‘స్కంద’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skanda Movie Review : రామ్ పోతినేని ‘స్కంద’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By gatla | The Telugu News | Updated on :28 September 2023,9:10 am

Skanda Movie Review : రామ్ పోతినేని(రాపో) సినిమా అనగానే ఆ సినిమాలో ఒక ఎనర్జీ ఉంటుంది. రామ్ అంటేనే ఎనర్జీ. కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్ అంటూ దూసుకొచ్చే రకం రామ్. ఆయన తాజాగా నటించిన సినిమా స్కంద. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కూడా వేశారు. దీంతో ఈ సినిమాకి రివ్యూలు కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ కంటే ముందే భారీ స్థాయిలో హైప్ వచ్చింది. రామ్ స్టార్ హీరో కాకపోయినా.. స్టార్ హీరో రేంజ్ బిజినెస్ జరిగింది. దీంతో ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే సోషల్ మీడియాలో రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు అదరగొట్టేశాయి. సినిమాపై ఇంకాస్త అంచనాలను పెంచాయి. రామ్ అంటే ఎనర్జీ.. ఆ ఎనర్జీకి మరో ఎనర్జీ బోయపాటి శీను తోడు అయితే ఇంకేమైనా ఉంటుందా? డబుల్ ఎనర్జీ రావాల్సిందే కదా.

అందుకే ఈ సినిమాలో డబుల్ ఎనర్జీ మనకు ఖచ్చింగా కనిపిస్తుంది. నిజానికి బోయపాటి అంటేనే ఊర మాస్. మామూలుగా ఉండదు. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టేస్తాడు. అది మరోసారి స్కందతో రుజువయింది. ఈ సినిమాలో రామ్ పొతినేని సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. శ్రీలీలకు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే. గోల్డెన్ లెగ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగాయి. సాయి మంజ్రేకర్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు ఏకకాలంలో కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలయింది. ఈ సినిమాల్లో ముఖ్యపాత్రల్లో గౌతమి, శరత్, అజయ్ పుర్కర్, దగ్గుపాటి రాజా, శ్రీకాంత్ నటించారు.

ram pothineni skanda movie review and rating

#image_title

Skanda Movie Review : సినిమా కథ ఇదే

ఈ సినిమాలో రామ్ పోతినేని పేరు కాంతా. రాయలసీమకు చెందిన కాంతా అనే యువకుడు ఓ పల్లెటూరులో ఉంటాడు. రైతు కొడుకు అయిన కాంతా.. ప్రజల కోసం పోరాడతూ ఉంటాడు. తన ముందు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు. ఇక.. అంజలి(శ్రీలీల) ఒక భూస్వామి కూతురు. తన అందగత్తె. కాంతాలో ఉన్న బలం, ధైర్యం, సాయం చేసే గుణం చూసి ఇష్టపడుతుంది. కాంతా కూడా అంజలిని ఇష్టపడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటాడు. కానీ.. వాళ్లిద్దరి ప్రేమే వాళ్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఎందుకంటే.. కాంత తండ్రి.. అంజలి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదంటాడు. కాంతా కుటుంబాన్ని కూడా అంజలి తండ్రి ఒప్పుకోడు. దీంతో రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఆ తర్వాత కాంతా తండ్రిని ఎవరో చంపేస్తారు? తన తండ్రిని చంపింది ఎవరు? తన తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవడం కోసం కాంతా ఏం చేస్తాడు? ఆ తర్వాత అంజలిని దక్కించుకుంటాడా? చివరకు తన పగ ఎలా చల్లారుతుంది.. అనేదే అసలు కథ.

Skanda Movie Review : సినిమా పేరు : స్కంద

నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ సిసిల్, ఊర్వశి రౌతెలా

డైరెక్టర్ : బోయపాటి శీను

నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

రన్ టైమ్ : 176 నిమిషాలు

విడుదల తేదీ : 28 సెప్టెంబర్ 2023

Skanda Movie Review : విశ్లేషణ

ఫైనల్ గా స్కంద సినిమా గురించి చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఫస్టాప్ అదిరిపోయింది. సినిమాలో ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ తో లవ్ ట్రాక్ దగ్గర్నుంచి.. కామెడీ సీన్లు, సెంటిమెంట్, ఫైట్లు, డ్యాన్స్ అన్నీ అదిరిపోయాయి. ఇక రామ్ కి శ్రీలీల సూపర్ జోడీగా కనిపించింది. థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో అదరగొట్టేశాడు. ఇక.. కల్ట్ మామ సాంగ్ అయితే అదరగొట్టేసింది. ఇక.. సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ ను మించిపోయింది. ఇక.. లాస్ట్ 20 నిమిషాల సినిమా అంటే క్లయిమాక్స్ అయితే బోయపాటి అద్భుతంగా చిత్రీకరించారు. స్టోరీ మామూలుదే అయినా దాన్ని ఒక మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో బోయపాటి సఫలం అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇక రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రామ్ ఎనర్జీ మరోసారి ఈ సినిమాలో నిరూపితం అయింది. శ్రీలీల కూడా అదరగొట్టేసింది. స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది అనే చెప్పుకోవాలి.

ప్లస్ పాయింట్స్

రామ్ ఎనర్జీ

స్క్రీన్ ప్లే

ఇంటర్వెల్ సీక్వెన్స్

దున్నపోతు ఫైట్

క్లయిమాక్స్

మైనస్ పాయింట్స్

ఫ్యామిలీ సీన్స్

రొటీన్ స్టోరీ

సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది