Khiladi Movie Review : రవితేజ ఖిలాడీ మూవీ రివ్యూ , రేటింగ్..!
Khiladi Movie Review : మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఖిలాడీ మూవీ రివ్యూ. ఈ మూవీ కరోనా వలన పలు మార్లు వాయిదా పడగా, ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. నైజాం హక్కులు రూ.9 కోట్లు, సీడెడ్ హక్కులు 3.6 కోట్లు, ఆంధ్రా హక్కులు 11 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 22 కోట్ల మేర బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్‌కు సిద్దమైంది. చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి కథానాయికలు నటించగా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించారు. కొద్ది సేపటి క్రితం చిత్రం విడుదల కాగా, మూవీ కథ ఎలా ఉందంటే..!
Khiladi Movie Review కథ: సినిమా మొత్తం పూర్తి యాక్షన్ సీన్స్‌తో నిండిపోయింది. డబ్బు ఉన్న కంటెయినర్ ను రవితేజ దోచుకోవడంతో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఆ కంటెయినర్ కోసం అందరి వెతుకులాట జరుగుతుంది. రవితేజ ఆ మనీ కంటెయినర్ లోనే కూర్చుని పోలీస్, విలన్ లకు సవాల్ విసురుతాడు. చివరకు ఆ మనీ కంటైనర్ పోలీసులకు చిక్కిందా..? లేదంటే విలన్ దక్కించుకున్నాడా, రవితేజ దగ్గర ఉందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మాస్ మహారాజ్ రవితేజ తనదైన మార్క్ డైలాగ్స్.. ఆయన మార్క్ మ్యానరిజంతో దూసుకుపోయాడు. అటు ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ పర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఆయన ఏ పాత్ర చేసినా.. తన పర్ఫామెన్స్ తో అదరగొడతున్నాడు. ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ పాత్ర మేరకు నటించి అలరించారు. నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, రావు రమేష్,మురళి శర్మ, వెన్నెల కిశోరం అనసూయ ఈ యాక్షన్ త్రిల్లర్ లో ముఖ్య పాత్రలు పోషించారు. వారి పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
చిత్రానికి మాస్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జత చేసి రమేష్ వర్మ ఈ సినిమా కథను తెరకెక్కించాడు.. ఇందులో మెయిన్ గా పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం సూపర్ అనే చెప్పాలి. సంగీతం బాగానే ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. రమేశ్ వర్మ ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ కలిసి ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, సుజిత్ వాసుదేవ్, జీకె విష్ణు సినిమాటోగ్రఫీని హ్యండిల్ చేయగా, అమర్ రెడ్డి కుడుముల ఎడింటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. అందరు వారి వారి టాలెంట్ చూపించారు.
Khiladi Movie Review ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన
యాక్షన్ సీన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
Khiladi Movie Review మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
సాగదీత సన్నివేశాలు
ఫైనల్ గా ఈ సినిమా రవితేజ అభిమానులకి మాంచి కిక్ ఇస్తుంది. ఇందులో ఆయన పర్‌ఫార్మెన్స్ అదుర్స్ అనేలా ఉండడంతో సినిమా ఎక్కడా బోరింగ్ అనిపించదు. అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాకి పోటీ కూడా లేకపోతుండడం కలిసి వచ్చే అంశం.