Categories: ExclusiveNewsReviews

Razakar Movie Review : ర‌జాకార్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Razakar Movie Review : ర‌జాకార్ మూవీ రివ్యూ మ‌రుగున ప‌డిన చరిత్ర‌కి సంబంధించిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో అలా వ‌చ్చిన చాలా చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇక ఈ రోజు రజాకార్ అనే మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.నిజాం ప్రభువుల నిజాం ప్రభువుల నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకత్వాన్ని క‌ళ్లకి క‌ట్టే విధంగా ర‌జాకార్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యాటా సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, వేదిక, మకరంద్‌ పాండే, ప్రేమ, అనుష్క త్రిపాఠి, రాజ్‌ అర్జున్‌, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం

Razakar Movie Review : క‌థ

నైజాం రాజ్యాన్ని చాలా మంది న‌వాబులు పాలించ‌గా, వారిలో ఎంతో మంది మంచి ప‌నులు చేశారు. కాని ఏడో నిజాం న‌వాబు అయిన మీరా ఉస్మాన్ అలీ ఖాన్ నైజాంని అఖండ భార‌తంలో విలీనం చేసేందుకు అస్స‌లు ఒప్పుకోలేదు. తానే హైద‌రాబాద్‌ని స్వాతంత్ర్య రాజ్యంగా ప‌రిపాలించుకుంటానంటూ కేంద్రానికి చెబ‌తాడు. అయితే ఖాసీం రజ్వీ సారథ్యంలో రజాకార్‌ వ్యవస్థ ఏర్ప‌డ‌డంతో హిందువులని ముస్లింలుగా మార్చాలంటూ హుకూం జారీ అవుతుంది. సిస్తు క‌ట్టాల‌ని, ప‌న్నులు క‌ట్టాల‌ని చాలా హింసిస్తూ ఉండేవారు. ఆ స‌మ‌యంలో ర‌జాకార్లకి వ్య‌తిరేఖంగా ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న వంటి అనేక మంది నాయకులు ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకొచ్చి వారికి వ్య‌తిరేఖంగా పోరాడారు. అయితే రజాకార్ల ఆగ‌డాలు, వారి అరాచ‌కాలు కేంద్ర హోమంత్రిగా ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ తెలుసుకున్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ప‌టేల్ ఈ స‌మ‌స్య‌కి ఎలా పరిష్కారం చూపించారు. ఎలాంటి ప‌రిస్థితుల‌లో నిజాం.. హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నేది మిగ‌తా చిత్ర క‌థ‌..

నటీనటులు: ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, రాజ్‌ అర్జున్‌, మకరంద్‌ పాండే, వేదిక, ప్రేమ, జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌, దేవి ప్రసాద్‌, తేజ్‌ సప్రు తదితరులు.
దర్శకత్వం :యాటా సత్యనారాయణ
నిర్మాత: గూడూరు నారాయణ రెడ్డి,
మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో
కెమెరా: రమేస్‌ కుషేందర్‌
ఎడిటింగ్ : తమ్మిరాజు.
బ్యానర్‌: సమర్‌వీర్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్పీ.

Razakar Movie Review : న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ష్

చిత్రంలో కాస్టింగ్ భారీగా ఉండ‌గా, ఖాసీం రజ్వీ పాత్ర ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. పాత్ర‌లో రాజ్ అర్జున్ అద‌ర‌గొట్టాడు. ఇక నిజాం న‌వాబ్‌గా మ‌క‌రంద్ పాండే చాలా నేచుర‌ల్‌గా నటించాడు. ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ, రాజన్నగా బాబీ సింహా ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల‌తో మెప్పించారు. వేదిక, ప్రేమలు ,వల్లభాయ్‌ పటేల్‌గా తేజ్‌ సప్రు త‌మ పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. ఏ ఒక్క పాత్రలో కూడా ఇది లోపం అనేలా లేదు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ పాత్ర‌ల‌లో ఒదిగి అల‌రించారు.

Razakar Movie Review : ర‌జాకార్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Razakar Movie Review : టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ష్

దర్శకుడు యాటా సత్యనారాయణ సినిమాని ఓ య‌జ్ఞంలా భావించి తీసిన‌ట్టు తెలుస్తుంది. స్క్రీన్ ప్లేని చాలా చ‌క్క‌గా న‌డిపిస్తూ ఎవ‌రికి ఎక్క‌డా బోర్ క‌లిగించకుండా చిత్రాన్ని బాగా న‌డిపించాడు. డ్రామా, ఎమోష‌న్స్ బాగా తెర‌కెక్కించాడు. ఓ వ‌ర్గానికి పాజిటివ్‌గా తీసిన‌ట్టు అనిపిస్తుంది. చిత్రానికి మ్యూజిక్ కూడా బ్యాక్‌ బోన్‌గా నిలిచింది. బతుకమ్మ పాట గూస్‌బంమ్స్ తెప్పించింది. భీమ్స్ సిసిరోలియో బీజీఎంతో కూడా దుమ్ము రేపాడు. రమేష్‌ కుషేందర్‌ కెమెరా వర్క్ , తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. అయితే ఆయ‌న ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలకు ఏ మాత్రం కొదవలేదు. చాలా రిచ్‌గానే మూవీ తీసారు.

Razakar Movie Review : విశ్లేషణ‌

రజాకార్‌ సినిమా ఏడో నిజాం హయంలో ఖాసీం రజ్వీ సృష్టించిన రజాకార్ల ఆగడాలను ఇతివృత్తంగా తీసుకొని చిత్రీక‌రించారు. ఆయ‌న దారుణాల‌ని బాగా చూపించారు. రజాకార్ల అత్యంత దారుణమైన చ‌ర్య‌లు క‌ళ్ల ముందు క‌ద‌లాడాయి. తెలంగాణ సాయుధ పోరాటం కోణంలోగానీ, కమ్యూనిస్టులు పోరాడిన కోణంలోగానీ చిత్రాన్ని కొంత చూపించి ఉంటే బాగుండేది. నిజాం నవాబ్‌తో కలిసి ఖాసీం రజ్వీ చేసిన కుట్రలు , హిందూవులను టార్గెట్‌ చేసి వాళ్లు ఎలాంటి అరాచ‌కాల‌కి పాల్ప‌డ్డార‌నే కోణంలో సినిమా తీసారు.ప‌రకాల, బైరాంపల్లి, గుండ్రంపల్లి, భువనగిరి, వంటి కొన్ని ప్రాంతాల్లోని సంఘటనలని కూడా మూవీలో చూపించారు. కథని ఏకకాలంలో మూడు యాంగిల్స్ లో చూపించ‌డంతో ఎమోషన్స్ మిస్‌ అయ్యింది. ఒక్కో ఘటన హృదయం బరువెక్కిపోయేలా అయితే చేసింది. మెయిన్‌ ఇన్స్ డెంట్స్ ని మాత్రమే టచ్ చేస్తూ మూవీని తెర‌కెక్కించారు. ఇప్పటితరానికి అవన్నీ తెలియదు కాబట్టి దాన్ని అంతే అర్థవంతంగా, ఎమోష‌న్స్ క్యారీ చేస్తూ ఇంకా కొంత బెట‌ర్‌గా తీస్తే బాగుండేది

Razakar Movie Review  చివ‌రి మాట‌

ర‌జాకార్ మూవీలో చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించారా లేదంటే చ‌రిత్ర‌ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చూపించారా అన్న‌ది ప‌క్క‌న పెడితే ఇది ఒక స్వాతంత్ర్య పోరాటంగా అంద‌రికి న‌చ్చుతుంది. మ‌త చరిత్ర కాకుండా గ‌త చరిత్ర అనుకుంటే ఈ మూవీ అంద‌రికి క‌నెక్ట్ అవుతుంది. హిందుత్వం పేరుతో అరాచకాలకు తెగబడి.. మత విద్వేషాలు రగిల్చే ఉన్మాదులు ర‌జాకార్ సినిమా చూడ‌క‌పోవ‌డం మంచిది

రేటింగ్ 3/5

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago