YCP : అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదు. 175 సీట్లే లక్ష్యంగా ప్రజలతో మమేకం అవ్వాలి.. అంటూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిలా.. ఆ దిశగానే వైసీపీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ‘గడప గడపకీ వైఎస్సార్సీ..’, ‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ పేర్లతో వైసీపీ ఓ అద్భుతమైన ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి కొంత మేర ప్రతిఘటన ఎదురవుతున్నా, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని వైసీపీ భావిస్తోంది. ఎక్కడికక్కడ తమకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నది వైసీపీ నేతల వాదనగా కనిపిస్తోంది. విపక్షాలు, దానికి తోడు వైసీపీ వ్యతిరేక మీడియా చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో..
మరింత అప్రమత్తంగా వుండాలన్నది వైసీపీ నేతలకు, అధినేత చేసిన సూచన.తాజాగా వైసీపీ, మంత్రుల బస్సు యాత్రకు ప్లాన్ చేసిన విషయం విదితమే. బస్సులో మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎన్నికల సీజన్ అయితే ఎలా వుంటుంది.? అన్న కోణంలోనే జరగనుంది. ఔను, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంకో రెండేళ్ళ వరకు వైసీపీ ప్రభుత్వానికి అవకాశం వున్నాగానీ, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్ వెళితే.?
అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న దరిమిలా, అదొక సన్నాహక కార్యక్రమంగా వైసీపీ భావిస్తున్నట్టుంది. మరింత అగ్రెసివ్‌గా జనంలోకి వెళుతున్నారు వైసీపీ నేతలు. కాగా, మంత్రుల బస్సు యాత్ర, తమ పార్టీ ఆవిర్భావ వేడుకలకు పోటీగా.. అంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వింత వాదనకు తెరలేపింది. అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ చేసిన యాత్రలతో పోల్చితే, వైసీపీ చేస్తున్నది ఆక్షేపణీయమేమీ కాదు.ఏదిఏమైనా, నేతలు.. అందునా మంత్రులు కూడా నిత్యం జనంలో వుంటే, తమ పార్టీ 2024లో మరింత ఘనవిజయం సాధిస్తుందన్న వైఎస్ జగన్ ఆలోచన అద్భుతం. 175 సీట్లలో ఎందుకు గెలవం.? అని పట్టుదలతో వున్న వైఎస్ జగన్, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
This website uses cookies.