Shekar Movie Review : శేఖ‌ర్ మూవీ రివ్యూ, రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shekar Movie Review : శేఖ‌ర్ మూవీ రివ్యూ, రేటింగ్‌..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2022,9:16 am

Shekar Movie Review : యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు ఎన్ని సూప‌ర్ హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రాజ‌శేఖ‌ర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఈ యాంగ్రీమ్యాన్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు. రీసెంట్‌గా శేఖ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

క‌థ‌: శేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్…క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ కేసులు చేధించడంలో నిపుణుడు. నేరస్తులు ఎవరైనా ఇట్టే కనిపెట్టే అంత టాలెంట్ ఉన్న మాస్టర్, అతని నైపుణ్యాన్ని ఉపయోగించి, పోలీసు అధికారులు డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి అతని సహాయం తీసుకుంటారు. ఒకరోజు ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది.. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో ఆమె చనిపోతుంది. ఆమెచావు మీద అనుమానంతో వెంటనే శేఖర్ తన తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు. తన భార్య యాక్సిడెంట్‌తో చనిపోలేదని,ఎవరో హత్య చేశారని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరకు భార్యను హత్య చేసింది ఎవరు? అతను కేసును పరిష్కరిస్తాడా? ఇందు అతని నుండి ఎందుకు విడిపోయింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Shekar Movie Review And Rating in Telugu

Shekar Movie Review And Rating in Telugu

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. డా.రాజశేఖర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌లో న‌టించి చూపించాడు. అచ్చం పోలీసు ఆఫీసర్ లా అదరగొట్టారు.కాని ఈ పాత్రకు కావల్సిన యాక్టీవ్ నెస్ అతనిలో మిస్ అయినట్టు స్పస్టంగా కనిపిస్తుంది. ఇక ఆయన భార్యగా నటించిన మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటి సారి తెలుగు సినిమాలో చేసినా కూడా అద్భుతంగా న‌టించింది. ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇలా ఎవరికి వారు తమ పరిధిమేరకు బాగానే నటించారు.

శేఖర్ సినిమా ఓపెనింగ్ బాగానే ఉంటుంది. పెద్ద‌గా స‌మ‌యం తీసుకోకుండా కథ ని చెప్పే ప్రయత్నం చేశారు.. కాని సినిమాలోకి వెళ్లే కొద్ది.. ఆడియన్స్ ను కదలకుండా చేయడంలో.. టీమ్ ఎక్కడో రాంగ్ స్టెప్ వేసినట్టు తెలుస్తోంది. సినిమాలో కొన్ని ట్విస్ట్‌లు మరియు మలుపులు ఉన్నాకూడా కానీ అవి కథలో సరిగ్గా ఇమడలేదు, శేఖర్ పాత్రలో రాజశేఖర్ ఓకే, కానీ దర్యాప్తు చేసేటప్పుడు అతను శారీరకంగా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ఈ సినిమాపై కాస్త ఫోక‌స్ పెడితే బాగుంటుంద‌ని అనిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్:
రాజ‌శేఖ‌ర్
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైన‌స్ పాయింట్స్:

రొటీన్ సీన్స్
బోరింగ్ స‌న్నివేశాలు
స్లో న‌రేష‌న్

ఇన్వెస్టిగేటివ్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈసినిమా జోసెఫ్‌ అనే మలయాళ సూపర్‌హిట్ సినిమాకు రీమేక్. ఈ విషయం మూవీ టీమ్ ఎక్కడా చెప్పలేదు కాని.. ఈసినిమా మాలయాళంలో హిట్ అయినంతగా తెలుగులో వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మన నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడంతో టీమ్ జాగ్రత్త పాటించలేనట్టు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది