Siraj : అంపైర్‌తోనే పరాచకాలా సిరాజ్.. ఈ బౌలర్ చేష్టలపై నవ్వుకుంటున్న నెటిజన్స్
Siraj : రోహిత్ సేన జోరుకు అడ్డంకి లేకుండా పోయింది. వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతుంది. శ్రీలంకతో జరిగిన తొలి టీ 20లో గెలిచిన టీమిండియా రెండో టీ20లో ) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు ఆడలేదు. అయినా కూడా ఈ ఇద్దరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. బ్రేక్ సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చిన ఈ ఇద్దరు అంపైర్‌తో పరాచకాలు ఆడారు. యజ్వేంద్ర చహల్ లంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంకను చేసి ఎల్బీ చేయగా, అసలంక డీఆర్‌ఎస్ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను ఎక్కడ తగల్లేదు.. దీంతో అసలంక క్లీన్‌ఔట్ అని తేలింది. అంపైర్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో డ్రింక్స్ బాయ్ అవతారంలో గ్రౌండ్‌లోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అంపైర్ వెనుకాల నిలబడి ఔట్ సింబల్ చూపించాడు.
Siraj : సిరాజ్ చేష్టలు నవ్వు తెప్పిస్తున్నాయిగా…
ఆ తర్వాత కుల్దీప్ కూడా వచ్చి అంపైర్ వెనక నుంచి ఔట్ సిగ్నల్ చూపించాడు. ఇదే సమయంలో ఫీల్డ్ అంపైర్ కూడా ఔట్ అని వేలు చూపించడం కెమెరాలకు చిక్కింది. ఈ దశలో కుల్దీప్ అంపైర్‌ను గుద్దుకుంటూ వెళ్లడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సిరాజ్ సాధారణంగా తెగ రచ్చ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడు. గ్రౌండ్‌లో లేకపోయిన సిరాజ్ చేసే సందడి నెటిజన్స్ కి సరికొత్త వినోదాన్ని అందిస్తుంది. ఈ రోజు మూడో టీ 20 మ్యాచ్ జరగనుండగా,ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీం భావిస్తుంది.
These guys ????#indvsl pic.twitter.com/3p4T9O4JUV
— vel (@velappan) February 26, 2022