Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 February 2026,10:10 pm

ప్రధానాంశాలు:

  •  Velidanda Village : భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోడీ తీసుకువచ్చిన నూతన విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు లేబర్ కోడ్ లు, స్వేచ్ఛావాణిజ్యం పేరుతో ట్రంప్ తో అమెరికా ఉత్పత్తుల దిగుమతికి సుంకాలు ఎత్తివేయడం దుర్మార్గమని అన్నారు.

Velidanda Village వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి జిరాంజీ పేరును తీసుకువచ్చి గతంలో ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి రాష్ట్రాలపై భారం మోపుతూ కేంద్రం పక్కకు తప్పుకునేటటువంటి విధానాన్ని అవలంబిస్తుందని, అందులో భాగంగానే రాష్ట్రాలపై 40% శాతం కేంద్రం 60% శాతం బరించే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను పక్కనపెట్టి నాలుగు కోడ్ లు గా తీసుకువచ్చి కార్పొరేట్లకు సంపన్న వ్యాపార వర్గాలకు

అనుకూలంగా మలిచారని వీటికి వ్యతిరేకంగా నేడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సభలో రైతులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ అధ్యక్షులు పారేల్లి నాగయ్య,ఇప్టు జిల్లా నాయకుడు కామల్ల శ్రీను, గండు నాగేష్, చనగాని పెద్ద సాంబయ్య, చనగాని పర్వతాలు, గండు మల్లయ్య, లచ్చయ్య, ముత్తయ్య, మల్లేష్, చనగాని లక్ష్మయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది