Super Machi Movie Review : సూప‌ర్ మ‌చ్చి మూవీ రివ్యూ, రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Super Machi Movie Review : సూప‌ర్ మ‌చ్చి మూవీ రివ్యూ, రేటింగ్‌..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 January 2022,1:00 pm

Super Machi Movie Review : చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ రెండో చిత్రం `సూపర్‌ మచ్చి`ఈ రోజు సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే . పులి వాసు దర్శకత్వం వహించి ఈ చిత్రంలో రచితా రామ్‌ కథానాయికగా నటిస్తుంది. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రిజ్వాన్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదలైంది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

క‌థ‌ : బాధ్య‌త లేకుండా బార్‌లో పాట‌లు పాడుకునే యువకుడు రాజు (కళ్యాణ్ దేవ్), అత‌డిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే అమ్మాయి మీనాక్షి (రచిత రామ్). ఆమె చూస్తే ఇన్ఫోసిస్‌ కంపెనీలో పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అలాంటి అమ్మాయి జల్సాలు చేసే రాజు వెనక ఎందుకు పడుతుంది..? అంతగా ప్రేమిస్తున్న ఆమెను రాజు ఎందుకు తిరస్కరిస్తాడు..? అలాటి సమయంలో ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి తనతో ఒక రాత్రి గడిపితే నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకొంటానని కండిషన్ పెడుతాడు. ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్‌) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.

Super Machi Movie Review and Rating in Telugu

Super Machi Movie Review and Rating in Telugu

Super Machi : నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు
నిర్మాత : రిజ్వాన్
దర్శకత్వం : పులి వాసు
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
విడుదల తేది: జనవరి 7, 2022

Super Machi Movie Review న‌టీన‌టుల ప‌నితనం

న‌టుడిగా కళ్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతో పోలిస్తే ఈయన నటనలో మెరుగుదల కనిపించింది. బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడిగా బాగానే ఉన్నాడు కళ్యాణ్.మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్‌ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్‌, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. రాజేంద్ర ప్రసాద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Super Machi Movie Review సినిమా ఎలా ఉందంటే..

తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. చూడ‌కుండా ప్రేమించుకోవ‌డం అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు పులివాసు చిత్రాన్ని ఆస‌క్తిక‌రంగా న‌డిపించాడు. అయితే తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్‌ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. సెకండాఫ్‌లో మాత్రం కథ కాస్త రోటీన్‌గా సాగుతుంది. భావోద్వేగమైన కథను ఓ కొత్త హీరోతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న నిర్మాతల తపన ప్రత్యేకమైనది. ఈ తపన రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కనిపించింది. కథకు తగ్గట్లుగా సినిమాను బాగా రిచ్‌గా నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ‌:

విజేత త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి కాస్త ఎంట‌ర్‌టైనింగ్‌గాను, బోరింగ్‌గాను అనిపించింది. మూవీలో కొత్త ద‌నం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు కాస్త బోరింగ్‌గానే ఫీల‌య్యారు. సంక్రాంతికి వ‌చ్చిన ఈ మూవీ పెద్ద‌గా అల‌రించ‌లేద‌నే చెప్పాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది